'నారీ నారీ నడుమ మురారి'తో చెప్పి మరీ హిట్టు కొట్టాన'ని కథానాయకుడు శర్వానంద్ అన్నారు. ఈ కథ విన్న తొలిరోజు నుంచే ఇది తనకెంతో నమ్మకాన్ని కలిగించిందని.. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేసినా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే ఊహించానని.. ఇప్పుడా నమ్మకం నిజమైనందుకు ఆనందంగా ఉందని తెలిపారు. శర్వా హీరోగా నటించిన ఈ సినిమాని రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్తా మేనన్, సాక్షి వైద్య కథానాయికలు. నరేశ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో సక్సెస్మిట్ ఏర్పాటు చేశారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీను వైట్ల శర్వానంద్ మాట్లాడుతూ.. 'ఇది నాకు చాలా ఎమోషనల్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో మూమెంట్. హిట్ కొడతానని చెప్పి మరీ కొట్టాను. సంక్రాంతికి రావాలన్న నా కల నెరవేర్చినందుకు నిర్మాత అనిల్‌కు ధన్యవాదాలు. నేను చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నా నాకు ఆ హిట్ ఇచ్చిన దర్శకుడు రామ్ అబ్బరాజుకు కృతజ్ఞతలు. ఈ చిత్రానికి మరో హీరో నరేశ్. మా నాన్న పాత్ర పోషించారు. సినిమా చూసిన వాళ్లంతా 'చాలా రోజుల తర్వాత ఇంతలా నవ్వుకున్నామ'ని చెప్తుంటే ఆనందంగా అనిపించింది. నేనెప్పుడు సంక్రాంతికి వచ్చినా అన్ని సినిమాలు ఆడతాయి. అందుకే ఇకపై ప్రతి సంక్రాంతికి నాకోసం ఒక స్లాట్ పక్కన పెట్టండి.. వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తా. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించనున్న నా తదుపరి సినిమా పండక్కే వస్తుందని అన్నారు. పండగ చివర్లో రావడం వల్ల ఎక్కువ థియేటర్లు ఇవ్వలేకపోయాం. కానీ, వచ్చే వారం నుంచి స్క్రీన్స్ పెరగబోతున్నాయి. ఇది చాలా పెద్ద హిట్ కొట్టబోతుందని అన్నారు నిర్మాత దిల్ రాజు.