అయినా దాన్ని అందుకోవాలి: గవాస్కర్
వెస్టిండీస్ తో చివరి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌తో 92 పరుగులు చేసినప్పటికీ, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెంచరీకి కేవలం 8 పరుగుల దూరంలో రోహిత్ ఔట్ కావడం తనను నిరాశపరిచిందని అన్నాడు. రోహిత్ శర్మ తన కెరీర్‌ను ఓ ప్రత్యేకమైన మైలురాయితో ముగించాలని తాను కోరుకుంటున్నట్లు గవాస్కర్ ఒక ఆసక్తికర లక్ష్యాన్ని నిర్దేశించాడు. జియోస్టార్‌లో ప్రసారమైన 'హయర్ క్రికెట్ లైవ్ కార్యక్రమంలో గవాస్కర్ మాట్లాదుతూ.. "2027 వన్డే ప్రపంచకప్ తర్వాత సుమారు 40 ఏళ్ల వయసులో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పరికే అవకాశం ఉంది. నా వ్యక్తిగత కోరిక ఏంటంటే.. అతను రిటైర్ అయ్యే నాటికి అతని వయను కన్నా ఎక్కువ వన్డే సెంచరీలు చేయాలి. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 35 సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో శతకం పూర్తి చేసి ఉంటే, ఆ నంఖ్య 36కు చేరేది. తద్వారా 40 సెంచరీల మార్కు మరింత దగ్గరయ్యేవాడు" అని అభిప్రాయపడ్డాడు. ఈ నందర్భంగా తన కెరీర్‌లోని చివరి దశను గవాస్కర్ గుర్తుచేసుకున్నాడు. "నాకు 38 ఏళ్ల వయసులో, టెస్టుల్లో 38 సెంచరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు మూడుసార్లు 90ల్లో ఔటయ్యాను. అందుకే రోహిత్ సెంచరీ మిస్ కావడం చూసి నిరాశ చెందాను. నేను సాధించలేకపోయాను., రోహిత్ అయినా ఆ ఘనత అందుకోవాలి" అని అభిలషించాడు. అదే సమయంలో 2023 ప్రపంచకప్ తర్వాత రోహిత్ బ్యాటింగ్ శైలిలో మార్పు వచ్చిందని గవాస్కర్ విశ్లేషించాడు. "ప్రపంచకప్‌లో మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేవాడు. ఇప్పుడు తన వికెట్ కు ఎక్కువ విలువ ఇస్తున్నాడు. ఇది మంచి పరిణామమే. అయినా, రోహిత్‌ను నేను 30-40 పరుగులు చేసే ఆటగాడిగా కాకుండా, 'సెంచరీల వీరుదు'గానే చూస్తాను" అని స్పష్టం చేశాడు.