పీఎంఏవై- గ్రామీణ 2.0తో గృహ నిర్మాణం
5.4,279.33 కోట్లతో అంచనాలు
తిరుపతిలో ఐఐడీటీ క్యాంపస్‌తో అనుసంధానం
ఏఐ లివింగ్ ల్యాబ్‌లో ఐటీ విప్లవం
ప్రభుత్వ భూముల్లో గృహాల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లుకు ఆమోదం
సభ ముందుకు గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లు
జలవనరుల పనులకు ఆమోదముద్ర
కేబినెట్లో కీలక నిర్ణయాలు
అమరావతి: వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు సంకల్పంగా ప్రభుత్వం అడు గులు ముందుకు వేస్తోంది..
పేదరిక అసమానతలు తొలగిం చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ-4ను ప్రతి ష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నారు. దీంతోపాటు గ్రామీణ పేద కుటుంబాలకు నిలువనీడ కల్పించే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో పీఎంఏవై-గ్రామీణ 2.0 గృహనిర్మాణంపై ఫోకస్ పెంచాలని అధికారులను ఆదేశించారు.. సుమారు 4279.33 5 వ్యయంతో యూనిట్ ఖర్చులో సబ్సిడీతో పాటు వడ్డీలేని రుణాలను అందించనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. బుధవారం సచివా లయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ ప్రజలకు శాశ్వత గృహ వసతి కల్పిం చేందుకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)- గ్రామీణ్ 2.0 పథకంలో ప్రతి గృహ యూనిట్ విలు రూ.2,99,000 గా నిర్ణయించింది. ఈ మొత్తం కన్వర్జెన్స్.. స్వయంసహాయక బృందం రుణాన్ని కూడా కలుపుకుని ఉంటుంది. రుణంపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం వడ్డీ సబ్సిడీగా తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. ఈ సబ్సిడీని 2026-27 నుండి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్య ప్రభుత్వం భరించనుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్రం సహకారంతో అమలు అవుతున్న గ్రామీణ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మా ణానికి స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందనేది ప్రభుత్వ భావన. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న -2020 నాటికి అందరికీ ఇల్లు" అనే సంకల్ప సాధన దిశగా ఇది ప్రధాన అడుగు కానుంది. మొత్తం రూ.4,279.33 కోట్లు వ్యయం ఈ పథకం కింద అంచనాలు రూపొందించారు. ప్రతి గృహ యూనిట్ వ్యయంలో కేంద్రం రూ.95,400, రాష్ట్రం రూ.63,600 వాటా కల్పించగా, మిగిలిన భాగం స్వయంసహాయక బృందాల రుణాలు కన్వర్జెన్స్ పథకాల ద్వారా సమకూరుతుంది. ఇందులో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 90 రోజులుపని ద్వారా రూ.27,000, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐహెచ్ఎస్ఎల్) కోసం రూ.12,000 నిధులు ఆదా అవు తాయి. దీంతో గ్రామీణ పేద కుటుంబాలపై గృహ నిర్మాణ భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. స్వయంసహాయక బృందాల ద్వారా అతి తక్కువ వడ్డీ రుణాలు లభించడం వల్ల మహిళా సమూహాల ఆర్ధిక స్థిరత్వం పెరుగుతుంది. కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో గృహ నిర్మాణ ప్రక్రియవేగవంతమై, గ్రామీణ ప్రాంతాల్లో నివాస పరిస్థితులు జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.
అసైన్డ్ సవరణ బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) (సవరణ) బిల్లు, 2026" ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా 1977 నాటి చట్టంలోని 2వ విభాగం (6) ఉపవిభాగం మరియు 3వ విభాగంలోని (2), (2ఆ) ఉపవిభాగాలకు నవరణలు చేస్తారు. దీనిద్వారా 2025 నాటి ఆర్డినెన్స్ నం.10 స్థానంలో కొత్త చట్టం ప్రవేశపెట్టి, కేటాయించిన భూముల బదిలీకి సంబంధించిన నిబంధనలను మరింత స్పష్టత తీసుకురావాలనేదే ఈ నవరణ లక్ష్యం. విశాఖపట్నం జిల్లా గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములపై ఆక్రమణలు లేదా నిర్మాణాల (1000 చ.గ. వ క్రమబద్దీకరణ దరఖాస్తుల సమర్పణ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములలో నిర్మించిన గృహాల క్రమబద్దీకరణ పథకం-2025 కింద దరఖాస్తుల సమర్పణ గడువును కూడా జూన్ 30 వరకు పొడిగించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలోని తోటపల్లి గ్రామంలో ఆర్.ఎస్. నెం. 2/- 1 లోని 45.60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థకు కాంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ స్థాపనకోసం కేటాయించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఈ భూమి విలువ మొత్తం...7.78 కోట్లు, అంటే ఎకరాకు... 16.96 లక్షలుగా నిర్ణయించింది. నంద్యాల జిల్లా సంజమాల మండలంలోని నోసం గ్రామంలో సర్వే నెం.1409/లో 1,500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్ఆర్ఆడీసీఏపీ సంస్థకు 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం లీజుగా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, గూడిలోవ గ్రామంలోని సర్వే నంబర్ 27 మొదలైన వాటిలో ఉన్న 18.57 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర సేవా సమితి (విశాఖపట్నం)కు బదిలీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2025-26 సంవత్సరానికి మేజర్, మీడియం మైనర్ ఇరిగేషన్ వనరులకు సంబంధించి 7189 పనులకు ఆపరే షన్ అండ్ .34439.09 మెయింటెనెన్స్ పనులకు లక్ష లుగా సవరించిన పాలనానుమతులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పనుల ప్రాధాన్యతను బట్టి, గతంలో ఉన్న పనుల సంఖ్యను 7, 174 నుండి 7,189కి పెరిగింది.
రామాయపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమి టెడ్ సంస్థకు సంబంధించి ఉన్న ప్రస్తుత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాన్ని సాగరామాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రీఫైనాన్స్ చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఈ రుణాన్ని ముందుగానే ముగించి రూ.3,938.10 కోట్ల రుణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ మౌలిక సదు-పాయాల ఫైనాన్సింగ్ వ్యయాలను తగ్గించడం, అలాగే సాగర్మాల పథకం ఆధారిత ఆర్థిక మద్దతు వ్యవస్ధను వినియోగించడం వంటి లక్ష్యాలకు అనుగుణంగా ఉండి, రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సమర్థత మరియు పోర్ట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ (రెండవ సవరణ) బిల్లు, 2026" ముసాయిదాకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఈ బిల్లు ద్వారా ఓటర్ల జాబితా తయారీ ప్రచురణకు ప్రస్తుత జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను కూడా అర్హత తేదీలుగా చేర్చడం ప్రతిపా దించబడింది. తద్వారా ఎన్నికల ప్రక్రియ మరింత సమర్థవంతంగా, సమకాలీనంగా కొనసాగుతుందని ప్రభుత్వ భావన. అగ్నిమాపక సేవల చట్టం, 1999లో కొన్ని సవరణలు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. రాష్ట్రంలో అగ్నిమా పక సేవల వ్యవస్థను ఆధునీకరించడం, సాంకేతిక పరిజ్ఞా నం వినియోగాన్ని విస్తరించడం, భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం అగ్నిమాపక దళాల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ సవరణల ప్రధాన ఉద్దేశ్యం.