ప్రేక్షకులను అలరిస్తే చాలు పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రాణిస్తాయి. ఇటీవల 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' విజయాలే దానికి నిదర్శనం. ఆ సినిమాలను విడుదల చేసిన బన్నీ వాస్, వంశీ నందిపాటి మరోసారి కలిసి సుహాస్ నటించిన 'హే బల్వంత్' చిత్రాన్ని తీసుకొచ్చారు. సీక్రెట్ బిజినెస్ కాన్సెప్ట్ తో చేసిన ప్రమోషన్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కృష్ణ (సుహాస్) చిన్నప్పటి నుంచే తండ్రి బల్వంత్ (నరేష్) చేస్తున్న బిజినెస్ చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ వ్యాపారం ఏమిటో అతనికి తెలియదు. దాన్ని దాచేందుకు బలవంత్ అతడిని బోర్డింగ్ స్కూల్లో పెడతాడు. చదువు పూ-ర్తయ్యాక ఇంటికి వచ్చిన కృష్ణ, అనారోగ్యానికి గురైన తండ్రి స్థానంలో బిజినెస్ బాధ్యతలు తీసుకోవడానికి ఆఫీస్‌కు వెళ్తాడు. ఆ వ్యాపారాన్ని కళ్లారా చూసిన అతనికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇంతకీ ఆ బిజినెస్ ఏమిటి? ఆ వ్యాపారం అతని ప్రేమ, తండ్రితో ఉన్న బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిందనేదే కథ. నవ్విస్తూనే మననులను హత్తుకునే కథ చెప్పాలనే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపి అచ్చర. ఈ ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ సీక్రెట్ బిజినెస్ కామెడీ బాగా వర్క్ అవుతుంది. కృష్ణ బిజినెస్ ఐడియాలు, లవ్ ట్రాక్ నరదాగా సాగుతాయి. ఇంటర్వెల్ క్కు ముందు వచ్చే ప్రకృతి వైద్యం ఎపిసోడ్ మంచి నవ్వులు పంచుతుంది. సుహాస్, సుదర్శన్, వెన్నెల కిశోర్ కలిసి చేసిన కామెడీ ట్రాక్ హైలెట్‌గా నిలుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కథపై ఆసక్తిని మరింత పెంచుతుంది. సీక్రెట్ బిజినెస్ నేపథ్యంతో సాగిన కథ సెకండ్ హాఫ్ కిడ్నాప్ డ్రామా వైపు మళ్లుతుంది. →న్నెల కిశోర్ లవ్ ట్రాక్, అజయ్ ఘోష్ ఇంట్లో జరిగే సన్నివేశాలు వినోదాన్ని అందిస్తాయి. డెడ్ బాడీ చుట్టూ నడిచే ఎపిసోడ్ ఇంకా బెటర్ గా వుండాల్సింది. చివరి ఇరవై నిమిషాల్లో తండ్రి-కొడుకుల భావోద్వేగాన్ని బలంగా చూపించాలనే ప్రయత్నం ఆకట్టుకునేలా ఉ ంటుంది. సుహాస్ తనకు సూటయ్యే పాత్రలో మరోసారి మెప్పించాడు. కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. శివానీ నాగారం మిత్ర పాత్రలో ఉత్సాహంగా కనిపించింది. నరేష్‌కు ఇచ్చిన ఎలివేషన్ సన్నివేశాలు వినోదంగా ఉ ంటాయి. సుదర్శన్ కామెడీ టైమింగ్ బాగా వర్క్ అయ్యింది. వెన్నెల కిశోర్, హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ పాత్రలు కథకు వినోదాన్ని జోడించాయి. వివేక్ సాగర్ సంగీతంలో పాటలు అంతగా గుర్తుండకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలకు బలం ఇచ్చింది. సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. ఎడిటింగ్ వదునుగానే వుంది. కథకు తగ్గ నిర్మాణ విలువలు కనిపించాయి.