కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి వయనాడ్ జిల్లాలో ప్రమాదానికి దారితీశాయి. మంగళవారం మీప్పాడి సమీపంలోని కల్లాడి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద కొండచరియలు విరిగివడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందగా, మట్టి కింద కూరుకుపోయిన ఆరుగురిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరికొంతమంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి వయనాడ్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా మట్టి, బండరాళ్లు ఒక్కసారిగా కొండపై నుంచి కూలిపడి నిర్మాణ ప్రాంతాన్ని పూర్తిగా కప్పివేశాయి. ప్రమాదం సంభవించగానే అక్కడ ఉన్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో కనీసం ఐదుగురు గాయపడగా, మరికొందరు మట్టిలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వివత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఈ ప్రమాదంపై కేరళం ముఖ్యమంత్రి వి.డి.సతీషన్ వెంటనే జిల్లా మంత్రులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక, పునరావాస చర్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆదేశించారు. పయనాడ్కు వెళ్లి సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షించాలని మంత్రులు అనిల్ కుమార్, సిద్దిక్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారులు అగ్నిమాపక, పోలీసు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. యనాడ్లో సోమవారం నుంచి భారీ వర్షాలు పడుతుండగా సొరంగం పనులను అదే రోజు నుంచి ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. ఆ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలోనే సుమారు 265 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. సొరంగ మార్గం ప్రాజెక్టు కోసం పని చేసే కార్మికులు నివసించే వసతి గృహంపై కొండచరియలు పడ్డాయి. అలాగే, కొన్ని నివాస గృహాలు, హోమ్ స్టేల పైనా భారీగా మట్టి, రాళ్లు వచ్చిపడ్డాయి. దీంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరోవైపు శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు, స్థానికులు ఉండొచ్చని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు భావిస్తున్నారు. అనేక వాహనాలు, ఇళ్లు దెబ్బతినగా.. నష్టాన్ని అధికారులు ఇంకా అంచనా వేయలేదు. శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొండచరియల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వీటికి ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియల కారణంగా మలప్పురం వయనాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు, మీనాక్షి వంతెన వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వయనాడ్లో 2024లోనూ కొండచరియలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు ముండక్కై, చూర్మాలా ప్రాంతాల్లో బండరాళ్లు విరిగిపడి 298 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. భారీ వర్షాల కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. భారత వాతావరణ శాఖ కేరళంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉ ండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు.