ఢిల్లీ: గతేడాది ఆస్ట్రేలియా టూరుకు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా తప్పించి గిలక్కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. రోహిత్‌పై వేటు వేయడం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆరోపించాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో తివారీ మాట్లాడుతూ.. రోహిత్‌ను తప్పించాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను గంభీర్ ప్రేరేపించి ఉండొచ్చన్నాడు. 'రోహిత్‌ను తప్పించడానికి బలమైన కారణం ఏంటో నాకు తెలియదు. అగార్కర్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడడు. అయితే, 'అతని భుజాలపై నుంచి తుపాకీ పేల్చడానికి అతన్ని మరొకరు ప్రభావితం చేశారా?' అన్నది కూడా ఆలోచించాలి. తెర వెనుక చాలా జరుగుతాయి. కోచ్ అభిప్రాయం తీసుకోకుండా చీఫ్ సెలెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోరు. కాబట్టి, రోహిత్ విషయంలో ఇద్దరూ బాధ్యులే. అని తివారీ తెలిపాడు. బీసీసీఐ మాజీ సెక్రెటరీ, ఐసీసీ చైర్మన్ జై షా.. రోహిత్‌ను తప్పించడాన్ని ఆపి ఉండాల్సిందని తివారీ అభిప్రాయపడ్డాడు.