దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది. ఈ కేసులో దాఖలైన అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది 2008, జులై 26న అహ్మదాబాద్‌లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల బాంబు దాడులతో ఉ గ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 56 మంది మరణించగా, 246 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తర్వాత సూరత్‌లో పేలని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 78 మందిపై విచారణ జరగగా, 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా తేల్చి, 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఉరిశిక్ష అమలుకు హైకోర్టు ధ్రువీకరణ తప్పనిసరి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం శిక్షల నిర్ధారణ కోసం హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ అల్పేష్ కొర్లే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన గుజరాత్ హైకోర్టు ధర్మాననం గత రెండున్నరేళ్లుగా దాదాపు 248 సార్లు అప్పీళ్లపై విచారణ జరిపి మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవితఖైదు విధిస్తూ 2022లో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్ధించింది. కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ పేలుళ్లలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మార్చి 31, 2027లోగా పరిహార చెల్లింపులు వూర్తి చేయాలని పేర్కొంది. నిషేధిత ఇండియన్ ముజాహిదీన్, సిమి ఉ గ్రవాద సంస్థల కుట్రను ప్రాసిక్యూషన్ నిరూపించ గలిగింది. దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం 'ఉపా' కింద దోషులుగా న్యాయస్థానం తేల్చింది. కాగా, దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో 38 మందికి ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే ప్రథమం. 2008 జులై 26న అహ్మదాబాద్‌లో 21 చోట్ల జరిగిన వరుస పేలుళ్లలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 246 మంది గాయవడ్డారు. నగరవ్యాప్తంగా ఆసుపత్రులు సహా పలుచోట్ల పేలుళ్లు జరగ్గా రెండ్రోజుల తర్వాత సూరత్ లోనూ బాంబులు గుర్తించారు. ఇక పేలుళ్ల శబ్దాలకు సమీపంలో ఉన్నవారు కొంతకాలం వినికిడి శక్తి కోల్పోయారు. దర్యాప్తులో భాగంగా అహ్మదాబాద్ నగర నేరవిభాగం 100 మందిని నిందితులుగా పేర్కొంది. 78 మందిపై విచారణ చేపట్టింది. 2022లో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో 49 మందిని దోషులుగా నిర్ధారించింది. 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. అప్రూవర్‌గా మారిన ఒక నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించింది. తొలుత ఇచ్చిన వాంగ్మూలాలు ఉ పసంహరించుకున్న మరో నలుగురు అప్రూవర్ల కు శిక్ష విధించింది. 2002లో జరిగిన గోధ్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు నాడు వార్తలు వచ్చాయి. తర్వాత ఇండియన్ ముజాహిదీన్ బాధ్యత ప్రక టించుకుంది. ఈ కేసు విచారణ సమయంలో నాటకీ య పరిణామాలు చోటుచేసుకున్నాయి. 24 మంది నిందితులు టన్నెల్ తవ్వి జైలు నుంచి తప్పించుకునేందుకు యత్నిం చారు. అయితే ఆ కుట్రను పోలీసులు భగ్నం చేశారు.