తెలుగు రాష్ట్రాలకు మరో సర్వీస్
కేరళలో మూడు అమృత్ భారత్, ఒక ప్యాసింజర్ రైలును ప్రారంభించిన ప్రధాని
తిరువనంతపురం నుంచి తెలంగాణలోని చర్లపల్లికి కొత్త అమృత్ భారత్ సర్వీసు
నాన్-ఏసీ కోచ్ లలోనూ సీసీటీవీ, చార్జింగ్ సాకెట్ల వంటి మెరుగైన సౌకర్యాలు
సామాన్యులకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణం లక్ష్యంగా ఈ రైళ్లు
ఈ కొత్త రైళ్ల నిర్వహణ బాధ్యతలను చూడనున్న దక్షిణ రైల్వే
తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో కొత్త
రైల్వే సేవలకు ఈరోజు పచ్చజెండా ఊపారు. తిరువనంతపురం నుంచి మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఒక ప్యాసింజర్ రైలును ఆయన ప్రారంభించారు. దేశంలో రైల్వే కనెక్టివిటీని ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. కొత్తగా ప్రారంభించిన వాటిలో తిరువనంతపురం- చర్లపల్లి, నాగర్‌కోయిల్-మంగళూరు, తిరువనంతపురం-తాంబరం అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్‌లు ఉన్నాయి. వీటితో పాటు త్రిస్సూర్- గురువాయూర్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలును కూడా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఈ రైళ్లు తమ గమ్యస్థానాలకు బయలుదేరాయి. ఈ నాలుగు సర్వీసులను దక్షిణ రైల్వే నిర్వహించనుంది. తిరువనంతపురం-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చనుంది. అలాగే, తిరువనంతపురం-తాంబరం రైలు తమిళనాడులోని పారిశ్రామిక, విద్యా కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అమృత్ భారత్ రైళ్లను సామాన్యులకు తక్కువ ధరలో మెరుగైన సౌకర్యాలు అందించేలా రూపొందించారు. ఇవి నాన్-ఏసీ రైళ్లు అయినప్పటికీ, వీటిలో ప్రయాణికుల భద్రత కోసం ప్రతి కోచ్ లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు ఫోన్ చార్జర్ సాకెట్, బాటిల్ హోల్డర్ వంటి వసతులు కల్పించారు. కోచ్‌లు విశాలంగా, సౌకర్యవంతంగా ఉన్నాయని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. సంప్రదాయ రైళ్లకు, ప్రీమియం రైళ్లకు మధ్య అంతరాన్ని తగ్గించి, తక్కువ ఛార్జీలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడమే ఈ రైళ్ల లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు.
నేతాజాకి ప్రధాని మోడీ ఘన నివాళి
ధైర్యసాహసాలకు వేతాజీ నిదర్శనమని వ్యాఖ్య
స్వాతంత్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులు అర్పించారు. భయ-ఎమెరుగని నాయకత్వానికి, అచంచల దేశభక్తికి నేతాజీ ప్రతీక అని కొనియాడారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ధైర్యసాహసాలు, పట్టుదలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతీక అని, దేశానికి ఆయన సేవలు అనితరసాధ్యమని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన జయంతిని యావత్ దేశం పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటోందని అన్నారు. ఆచంచల దేశభక్తికి, భయమే తెలియని నాయకత్వ పటిమకు అసలైన ప్రతీకగా నిలిచే నేతాజీ రాబోయే తరాలకు న్పూర్తిగా నిలుస్తారని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివస్ కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి ఏడాది కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించింది. ఇక 2023లో అండమాన్, నికోబార్ దీప సముదాయంలోని 21 ద్వీపాలకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లను ఖరారు చేసింది. ఇదిలావుంటే దశవ్యాప్తంగా నేతాజీకి ప్రజలు నివాళి అర్పించారు.
ఆ మహానుభావుడి ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు. ఇకపోతే బ్రెజిల్ అధ్యక్షుడు లుల డ సిల్వాకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వచ్చే నెలలో లుల భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో మోదీ ఆయనతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ముచ్చటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం సుదృఢంగా సాగుతోందని, వచ్చే ఏడాది నూతన శిఖరాలను అధిరోహిస్తుందంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. రెండు దేశాలూ ట్రంప్ టారిఫ్‌ల బారిన పడడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.