రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్?కు కిక్కిచ్చే న్యూస్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంటర్నేషనల్, ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ బోర్డుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు అనుమతి లభించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం శనివారం ప్రకటించింది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు సూచించిన నిర్దిష్ట నిబంధనలు, షరతులకు అనుగుణంగానే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుందని తెలిపింది. 'ఇంటర్నేషనల్, ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు హెూం శాఖ, కర్ణాటక ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని ప్రకటించడానికి మేం సంతోషి స్తున్నాం' అని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొం ది. దీంతో 2026 ఐపీఎల్' లో ఆర్సీబీ హెూం గ్రౌండ్ మ్యాచ్? లు చిన్నస్వామిలోనే నిర్వహించనున్నారు. ఈ వార్తతో ఆర్సీబీ ఫ్యాన్స్"లో జోష్ నిండినట్లైంది. కాగా, 2025 ఐపీఎల్ లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలవడంతో జూన్ 04న చిన్నస్వామి స్టేడియంలో సక్సెస్ సంబరాలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఊహించిన దానికంటే అధికంగా అభిమానులు రావడంతో స్టేడి యం బయట తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఘటన లో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైకెల్ డి.కున్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసింది. చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సురక్షితం కాదని ఈ కమిషన్ తేల్చింది. దీంతో ఆ తర్వాత ఈ స్టేడియంలో నిర్వహించేందుకు షెడ్యూల్ చేసిన అన్ని మ్యాచ్" లను షిఫ్ట్ చేశారు. తర్వాత కర్ణాటక డొమెస్టిక్ మహారాజా ట్రోఫీని కూడా ఆగస్టులో మైసూరుకు తరలించారు. ఆ తర్వాత మహిళల వన్డే వరల్డ్ కప్" లోనూ చిన్నస్వామిలో కొన్ని మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, వాటిని వేరే వేదికలకు మా ర్చారు. విజయ్ హజారే ట్రోఫీలోని మ్యాచ్'లు కూడా ఇక్కడ జరగాల్సి ఉండగా, అనుమతి లేకపోవడంతో ఆ మ్యాచ్ లను బీసీసీఐ ఎక్స్ లెన్స్"కు తరలించారు. అయితే ఇప్పుడు కొన్ని షరతులతో మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఫ్యాన్స్"కు కచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. కాగా, 2026 ఐపీఎల్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.