టాలీవుడ్ ప్రేక్షకులకు 'బస్ స్టాప్', 'డీజే టిల్లు' వంటి చిత్రాలతో బాగా దగ్గరైన నటుడు ప్రిన్స్ సిసిల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లో సెటిల్ అయిన తన స్నేహితురాలు సాయి ప్రతిమ మాచిరాజుతో గత నెల 24న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఆయన, తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ ఇచ్చారు. సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించిన ఈ వేడుకకు సంబంధించిన స్పెషల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రిన్స్ సిసిల్, సాయి ప్రతిమల వివాహం స్యూజిలాండ్లో అత్యంత వైభవంగా జరిగింది. అమ్మాయి అక్కడే నివసిస్తుండటంతో ఇరు కుటుంబాల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఈ పెళ్లి నిర్వహించారు. ఇక ఆ తర్వాత బుధవారం. రాత్రి హైదరాబాద్‌లో టాలీవుడ్ మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం ప్రత్యేకంగా గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కొత్త జంట ఎంతో సంతోషంగా కనిపించింది.