ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు
డీఏల చెల్లింపులు, హెల్త్కేర్డులపై స్పష్టత నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో సీఎం భేటీ గతంలోనూ ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎంగా బాబు
2014-19లో 43% ఫిట్మెంట్ మంజూరు సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ జగన్ వచ్చాక.. ఉద్యోగుల జీవితాల్లో భారీ కుదుపు 23 శాతం రివర్స్ పీఆర్సీ ప్రకటించి పక్కా మోసం హెచ్ఎస్ఏల్లోనూ భారీ కోత.. 24%-16% మధ్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం దిశగా ఏపీ కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే నేడు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పరిధిలోని 11 ఉద్యోగ, ఉ పాధ్యాయ సంఘాల నేతలతో అత్యంత కీలకమైన భేటీ నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని భావిస్తున్న తరుణంలో ఈ సమావేశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం నాడు ఏపీ జేఏసీ ముఖ్య నాయకులు విద్యాసాగర్, డీవీ రమణ, భారతీ ప్రసాద్ తదితరులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను, క్షేత్రస్థాయిలో వారు ఆందోళనలకు సిద్ధమవుతున్న పరిస్థితులను విద్యాసాగర్.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఉ ద్యోగులకు న్యాయబద్ధంగా చేయాల్సిన ప్రతి పనినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు. "ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు, ఇప్పటికే అధికారులు ఒక పక్క చర్చలు జరుపుతున్నప్పుడు మీరు ఎందుకు తొందరపడుతున్నా రు? కాస్త ఓర్పు ఎందుకు పట్టలేకపోతున్నారు?" అని ముఖ్యమంత్రి జేఏసీ నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, తాము కూడా చర్చలను ఆహ్వానిస్తున్నామనీ, కానీ ఆ చర్చలు కేవలం అధికారుల స్థాయిలో కాకుండా నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలోనే జరగాలని తాము ఆకాంక్షిస్తున్నామని జేఏసీ నేతలు బదులిచ్చారు. ఉ ద్యోగులు ప్రధానంగా ఆర్థిక, సర్వీస్ పరమైన సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. నూతన పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా, పాత పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. అంతేకాకుండా సరెండర్ లీవులు, జీపీఎఫ్ అడ్వాన్సులు వంటి ఆర్థికపరమైన చెల్లింపుల కోసం ఉద్యోగులు పట్టుబడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇటీవలి రిపోర్టు ప్రకారం, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఇటీవల వివిధ ఉద్యోగ సంఘాలతో సమావేశమై, వారి నిజమైన డిమాండ్లకు న్యాయం చేసేందుకు, వారి ప్రధాన ఆర్ధిక సమస్యలైన పెండింగ్‌లో ఉన్న డిఏ, మధ్యంతర సహాయం (ఐఆర్), పిఆర్సి సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమగ్రంగా చర్చిస్తామని వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (విఆర్ఎలు), విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు (విఆర్‌లు) సహా ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర కార్మిక వర్గంలో విస్తృత ఆందోళన, ఉద్యమాలను నివారించడానికి ముఖ్యమంత్రి నుంచి నేరుగా తక్షణ, స్పష్టమైన పరిష్కారాలను డిమాండ్ చేస్తూ, తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఈ నివేదికల ప్రకారం చూస్తే ఉద్యోగుల్లో పేరుకుపోయిన అసంతృప్తిని చల్లార్చేందుకే నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారని స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర బజానా పరిస్థితిని, వాస్తవ ఆర్థిక లోటును ఉద్యోగ సంఘాల ముందు ఉ oచి, వారి డిమాండ్లలో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించి, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి బకాయిల చెల్లింపుపై ఒక నిర్దిష్టమైన టైమ్-లైన్ (చెల్లింపుల క్యాలెండర్) ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ఉద్యోగుల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోయి, పాలన సజావుగా సాగుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన (శనివారం) తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని ఏపీ జేఏసీ గతంలోనే నిర్ణయించింది. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే సమ్మె లేదా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాలని, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కితే అది పరిపాలనపై, ప్రభుత్వ ప్రతిష్ఠపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వం గ్రహించింది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలన్నా, పరిపాలన సాఫీగా సాగాలన్నా ప్రభుత్వ యంత్రాంగమైన ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం అని గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు, వారు ఆందోళన బాట పట్టకముందే వారిని స్వయంగా పిలిపించి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఏది ఏమైనా, శనివారం నాటి ఉ న్నతస్థాయి భేటీతో ఉద్యోగుల ప్రధాన సమస్యలకు ఒక సానుకూల పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.