భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీలో చంద్రబాబు
అమరావతి : ప్రపంచంలోని అనేక దేశాల్లో మానవ వనరుల కొరత ఉందని, ఆ కొరతకు భారత్ లో సమాధానం లభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్విట్జర్లాండ్లో అక్కడి భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం భేటీ అయ్యారు. ఏపీ పాలసీల గురించి వివరించి.. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని మృదుల్కుమార్ను కోరారు. మానవ వనరుల కొరత తీర్చేందుకు భారత్లో యువత సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. స్విట్జర్లాండ్లోని కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధన అవకాశాలపై చర్చించారు. స్విట్జర్లాండ్ ఫార్మా కంపెనీలు, వర్సిటీలు ఏపీకి సహకరించాలని లోకేశ్ కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు రాయబారి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కంపెనీలకు మానవ వనరులు అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ ఛైర్మన్ కిషోర్ భేటీ అయ్యారు. 'దావోస్ మ్యాన్' అంటూ చంద్రబాబును ఆయన కొనియాడారు.