భారత క్రికెట్ దిగ్గజాలు విరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ వారసులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా అండర్-19తో జరగమన్న సిరీస్‌కు భారత జట్టులో ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రావిడ్‌కు చోటు దక్కింది. భారత్-ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, 21, 23 తేదీల్లో రాజ్‌కోట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఉంటాయి. సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు రాజ్‌కోట్‌లో తొలి మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 5 నుంచి 8 వరకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం 'బి' గ్రౌండ్లో రెండో మ్యాచ్ ఉంటుంది. వన్డే జట్టుకు లక్ష్య రైచందాని కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. యశవర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. రెడ్‌బాల్ మ్యాచ్‌లకు చౌహాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రైచందాని వైన్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ కు ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. అన్వయ్ ద్రవిడ్ ఇటీవల శ్రీలంక పర్యటనలో రెండు వన్డేలు ఆడి 101 పరుగులు చేశాడు. వన్డే జట్టులో ఆర్యవీర్, అన్వయ్ తో పాటు మనల్ చౌహాన్, చిగురుపాటి వెంకటకు చోటు లభించింది. సాగర్ విర్క్, అన్మోల్ జీత్ సింగ్, ఇషాన్ సూద్ వన్డే జట్టులో లేరు.