రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఊదేశింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బ్యాట్లతో విరుచుకుపడటంతో మైదానంలో వరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాటు ఏకంగా ఐదు భారీ రికార్డులు బద్దలయ్యాయి. కివీస్ బౌలర్లు చుక్కలు చూడగా, భారత బ్యాటర్లు చరిత్ర తిరగరాశారు. భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ ఊచకోత కోశాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20ల్లో న్యూజిలాండ్‌పై అత్యంత వేగంగా ఈ మనత సాధించిన భారత ప్లేయర్ రికార్డు సృష్టించాడు. సరిగ్గా 48 గంటల క్రితమే అభిషేక్ శర్మ (22 బంతుల్లో 50) నెలకొల్పిన రికార్డును ఇషాన్ చెరిపేయడం విశేషం. సాధారణంగా పవర్ ప్లేలో ఓపెనర్లు మాత్రమే హాఫ్ సెంచరీలు సాధిస్తుంటారు. కానీ ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ త్వరగా అవుట్ కావడంతో వన్ డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్, పవర్ ప్లే ముగిసేలోపే తన యాభై పరుగులు పూర్తి చేశాడు. తద్వారా పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ బాదిన తొలి నాన్ ఓపెనర్ భారత బ్యాటర్‌గా ఇషాన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో (ఫుల్ మెంబర్ జట్ల మధ్య) 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా భారత్ నిలిచింది. 209 పరుగుల లక్ష్యాన్ని 28 బంతులు మిగిలి ఉండగానే టీమ్ ఇండియా పూర్తి చేసింది. గతంలో పాకిస్థాన్ (24 బంతులు మిగిలి ఉండగా 205 రన్స్ ఛేజ్) పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. న్యూజిలాండ్ బౌలర్ జాక్ ఫౌల్స్ కు ఈ మ్యాచ్ ఒక పీడకల. కేవలం 3 ఓవర్లలోనే 67 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక కివీస్ బౌ లర్ ఒకే మ్యాచ్‌లో ఇన్ని పరుగులు ఇవ్వడం ఇదే మొదటిసారి. 2018లో బెన్ వీలర్ (64 పరుగులు) పేరిట ఉన్న చెత్త రికార్డును ఫౌల్మ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత పేనర్ అర్షదీప్ సింగ్ కూడా ఒక అవాంఛనీయ రికార్డును మూటగట్టుకున్నాడు. మ్యాచ్ లోని తొలి ఓవర్లోనే 18 వరుగులు ఇచ్చి, టీ20ల్లో మొదటి ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్ నిలిచాడు. గతంలో 2022లో ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ భారత బౌలర్‌పై 18 పరుగులు రాబట్టగా, ఇప్పుడు అర్షదీప్ ఆ రికార్డును సమం చేశాడు.