ప్రతీ క్షణం.. ఎంతో ఉద్విగ్నం పదుల సంఖ్యలో యుద్ధ నౌకలు..
ఆపై దేశ విదేశాల అతిథులు పులకరిస్తున్న సాగర నగరం ఆద్యంతం.. అత్యంత అద్భుతం
విశాఖపట్నం విశాఖ సాగరతీరం మరో అంతర్జాతీయ వేడుకకు వేదికైంది. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వ హించే 'అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష రెండు రోజుల కిందటే వైభవంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలో మూడోసారి నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్కు విశాఖ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. సరిగ్గా దశాబ్దం క్రితం, అంటే 2016లో ఇక్కడ ఐఎస్ఆర్ వేడుక జరిగింది. నేటి నుండి ఫిబ్రవరి 27వ 25 వతేదివ తేదీవరకు పది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో సుమారు 50 దేశాల నుండి 4000 మంది అతిథులు. 70కి పైగా అత్యాధునిక యుద్ధనౌకలు పాల్గొంటున్నాయి.
ఎంతో చరిత్ర
భారత రాష్ట్రపతి తన హయాంలో నౌకాదళ సామర్ధ్యాన్ని ఒకసారి సమీక్షిస్తారు. దానిని ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అంటారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్) అంటే.. దేశ నౌకాదళంతోపాటు పొరుగు దేశా లకు చెందిన నౌకలు పాల్గొంటాయి. ఈ సందర్భంగా ఆయా దేశాలకు చెందిన నౌకల సామర్థ్యాలను రాష్ట్ర పతి సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో కీలకమైన యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు పాల్గొంటాయి. 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో డిసెంబర్ 3న భారత వైమానిక స్థావరాలపై పీఎన్ఎస్ ఘాజీతో దాడికి దిగింది కరాచీ నావికాదళం. ఇందుకు ప్రతిగా కమాండర్ పటాన్ శెట్టి గోపాలరావు నాయకత్వంలో డిసెంబర్ 1న గుజరాత్లో దాగి ఉన్న వారిపై మెరుపు దాడి చేసి ఆపరేషన్ ట్రెడెంట్ను విజయవంతంగా పూర్తిచేసింది. అప్పటి నుంచి ఈ గెలుపునకు చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే వేడుకలు నిర్వహిస్తోంది నౌకాదళం.
ఎంతో వైవిధ్యంగా..
గతానికి భిన్నంగా ఈ వేడుకులు నౌకాదళసమీక్షక పరిమితం కాకుండా, మూడు ప్రధాన కార్యక్రమాల' సమాహారంగా సాగనున్నాయి. ఐఎస్ఆర్ తోపాటు ప్రతి రెండేళ్లకోసారి జరిగే 'మిలాన్' మల్టీ లాటరల్ నేవల్ ఎక్సర్సైజెన్, 'ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం' కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 'మిలాస్' పేరుతో ఒక ప్రత్యేక గ్రామాన్ని ప్రారంభించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
వ్రతీది ప్రత్యేకమే..
విశాఖలో జరిగే ప్రతి వేడుక ప్రత్యేకమే. ఇప్పటికే. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు మంగళవారం రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము సాగర నగరానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ దీరజ్సంగ్ రాకూర్తో పాటు నావికాద కానికి చెందిన అనేక మంది ప్రముఖులు ఇప్పటికే నగ దానికి చేరుకున్నారు. ఇక బుధవారం రాష్ట్రపతి యుద్ధ నౌకలను సమీక్షించనుండగా, ఫిబ్రవరి 10న ఆర్కే బీచ్లో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అత్యంత వైభవంగా జరగనుంది. 21వ తేదీ నుండి 25 వరకు. సముద్ర గర్భంలో జరగబోయే యుద్ధ విన్యాసాలు సందర్శకులను మంత్రముగులను చేయనున్నాయి