విశాఖపట్నం: హ్యాట్రిక్ విజయాలతో ఇప్ప టికే సిరీస్ కైవనం చేసకున్న టీమిండియాకు నాలు గో టీ20లో మాత్రం షాక్ తగిలింది. బుధవారం విశాఖపట్నం వేదికగా జరిగిన 4వ టీ20లో అల్ రౌండ్ ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో భారతన్ను ఓడించి సిరీస్‌లో తొలి విజ యాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. టిమ్ సీఫెర్ట్ (62), కాన్వే (44), డారిల్ మిచెల్ (39 నాటౌట్) చెలరేగి బ్యాటింగ్ చేశారు. అనం తరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే (65; 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ మెరుపులు మెరిపించినా.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో టీమిండియాకు పరాభవం తప్పలేదు. రింకూ సింగ్ (39; 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సు), సంజూ శాంసన్ (24) పర్వాలేదనిపించినా.. అభిషేక్ శర్మ (0), కెప్టెన్ నూర్యకుమార్ (8), హార్దిక్ పాండ్య (2) పూర్తిగా తేలిపోయారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3 వికెట్లతో విజృం ఖించగా.. జాకబ్ డఫీ, ఇష్ సోధి తలా 2 వికెట్లు పడగొట్టారు. మరోవైపు మాట్ హెన్రీ, జాక్‌కు చెరో వికెట్ దక్కింది. ఇక ఇరుజట్ల మధ్య తిరు వనంతపురం వేదికగా 31న (శనివారం) ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది.
ఓపెనర్ల జోరు..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజి లాందు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, డావెన్ కాన్వే అదిరే ఆరంభాన్ని అందిం చారు. చెలరేగి ఆడిన వీరు తొలి వికెట్ కు 8.2 ఓవర్లలోనే శతక భాగస్వామ్యం ఏర్పర్చు కున్నారు. తర్వాత కుల్దీప్ నూపర్స్ బంతితో కాన్వే (44; 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) నుఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. తర్వాత వచ్చిన రచిస్ రవీంద్ర (2)ను బుమ్రా పెవిలియనికి పంపాడు. ఈ దశలో ఆకాశమే హద్దుగా ఆడుతూ కేవలం 25 బంతుల్లోనే రికార్డు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పీపెర్ట్ (62:36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)ను చివరికీ అర్డిదీప్ రింకూ చేత క్యాచ్ పట్టించాడు. అనంతరం గ్లెస్ ఫిలిప్స్ (24), డారిల్ మిచెల్ (39 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (11), జాక్ (18) కూడా వేగంగా ఆడటంతో చివరికీ కివీస్ నిర్ణీత ఓవర్లలో 215/7భారీస్కోరు సాధించింది. భారత బౌలర్లలో అర్ధప్ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, రవి బిష్ణోయ్ తలా తలా వికెట్ దక్కించుకున్నారు.