ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ పై కారుకూతలు
అల్లాకు సర్వస్తోత్రాలంటూ వ్యంగ్యాస్త్రాలు
హార్ముజ్ తెరవాలంటూ తిట్ల దండకం
నరకానికి పోతారంటూ శాపనార్థాలు
మంగళవారం మీకు మూడిందంటూ హెచ్చరికలు
విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు ధ్వంసం చేస్తానని వార్నింగ్
ఇరాన్ ఘర్షణల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం కోల్పోయారు. భీకర దాడులు చేసినా, అల్టిమేటమ్‌లు, వార్నింగ్‌లు ఇచ్చివా శత్రుదేశం దారికి రాకపో వడంతో ఆయన చిర్రెత్తిపోతున్నారు. పైగా తమ యుద్ధ విమానా లను, శక్తివంతమైన ఫైటర్లను కూల్చేస్తుండటం ట్రంప్ ఆహాన్ని దెబ్బతీసింది. ఓవైపు యుద్ధం ముగింపునకు మార్గం కనిపించక పోవడం, మరోవైపు దేశీయంగా పెరుగుతున్న వ్యతిరేకత, ఆర్థిక, రాజకీయ సవాళ్లతో లోలోన మండిపోతున్నారు. ఇంకొకవైపు అంతర్జాతీయంగా అమెరికాతో పాటు తన వ్యక్తిగత పరపతి, ఇమేజీ రోజురోజుకు డ్యామేజీ అవుతుండటం ట్రంప్‌ను చికాకుకు గురిచేస్తోంది. రెండు రోజుల్లో ఇరాన్ అంతు చూస్తానని యుద్ధం ప్రారంభ రోజుల్లో బీరాలు పలికిన తనకు, ఇరాన్ కొరకురాని కొయ్యగా మారింది. పాలకుల్ని హతమార్చినా, ఆర్మీ టాప్ కమాం డర్లను, అధిపతులను అంతమొందించినా టెహ్రాన్ వెనక్కి తగ్గకపోవడం అమెరికా అధ్య క్షుడిని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోం ది. లక్ష్యాలు సాధించామంటూ పదే పదే ప్రకటనలు చేసిన ట్రంపకు అదే నోట ఇరాన్‌కు హెచ్చరికలు, డెడ్లైన్లు విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్ తన హెచ్చరికలను ఖాతరు చేయకపోవడంతో సహనం కోల్పోయన ఆయన, ఇక ఏకంగా తిట్ల దండకం అందుక ్నన్నారు. సంస్కారహీనంగా వ్యవహరిస్తూ బూతుల దాడికి దిగారు. నోటితో ఉచ్చరించలేని విధింగా ల.. కారాలతో ఇరాన్‌ను దూషించారు. ఇంకా అంతకు మించిన బూతు బాంబులు పేల్చారు. 48 గంటల్లో ప్రళయం చూపిస్తానని శనివారం టెహ్రాను బెదిరించిన ఆయన, ఆదివారం మరింత శివాలెత్తారు. ఇరాన్లో తప్పించుకున్న తమ వాయుసేన సిబ్బందిని కాపాడి, సురక్షితంగా తరలించామని అంతకు ముందు పేర్కొన్న ఆయన. దానిని ఒక అద్భుతంగా అభివర్ణించారు. ఆయితే కొన్ని గంటల తరువాత తన ట్రూత్ సోషల్ మీడియాలో ఇరాన్‌పై తిట్లతో విరుచుకుపడ్డారు. తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఇరాన్‌పై విరుచుకుపడ్డారు. పరుష పదజాలంతో దూషణలకు దిగారు. ఈమేరకు వరుస పోస్టులు పెట్టారు. మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే. బ్రిడ్జ్ డే. రెండూ ఒకే రోజు జరగనున్నాయి. అలాంటిది మరెక్కడా జరగదు!! ఆ జలసంధిని తెరవండి రా పిచ్చి వెధవల్లారా (బాసర్ట్స్), లేకపోతే నరకానికి వెళ్తారు.. చూస్తూ ఉండండి! చివరిసారిగా అల్లాను ప్రార్థించుకోం డి.. సర్వస్తోత్రాలు చెప్పుకోండి అంటూ అత్యంత తీవ్ర పదజాలం తో రాశారు. ఈ నెల 7వ తేదీన ఇరాన్లో విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను కూల్చివేస్తామని ఈ విధంగా హెచ్చరించారు.