అమ్మో ఒకటో తారీఖు అని భయపడిన ప్రజలకు జూలై ఒకటో తేదీ ఒక శుభవార్త వచ్చింది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వంట గ్యాస్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా యుద్ధ భయాలు నెలకొన్న వేళలో వంట గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు. కానీ, అందుకు విరుద్ధంగా వంట గ్యాస్ ధరలను తగ్గిస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సామాన్యులకు ఊరట లభించినట్టయింది.
గ్యాస్ రేట్లు ఎంత మేర తగ్గాయంటే..
ప్రాంతాన్ని బట్టి వంట గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వ సబ్సిడీ లేని గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (14.2 కేజీ) ధరను దేశవ్యాప్తంగా సగటున ₹30 నుంచి ₹50 వరకు తగ్గించారు. ఈ తగ్గింపు తరువాత ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి:
నగరం
|
పాత ధర (₹)
|
కొత్త ధర (₹)
|
తగ్గింపు (₹)
|
ఢిల్లీ
|
₹903
|
₹873
|
₹30
|
ముంబయి
|
₹902
|
₹872
|
₹30
|
హైదరాబాద్
|
₹955
|
₹925
|
₹30
|
చెన్నై
|
₹918
|
₹888
|
₹30
|
కోల్ కతా
|
₹929
|
₹899
|
₹30
|
|
|
|
|
మరోవైపు వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ పై ఎటువంటి సమాచారం ఇప్పటి వరకూ రాలేదు. ఈ గ్యాస్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో వంట గ్యాస్ ధరల్లో తగ్గుదల కనిపిస్తోందని వాటంటున్నారు. ఇంతవరకూ వరుసగా వంట గ్యాస్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పడు ఒక్కసారిగా ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతారు.