ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఒకవైపు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. మరొకవైపు తమిళనాడు రాజకీయాలలో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా ఈమె డ్రామా చేయడం సిగ్గుగా అనిపించలేదా? అంటూ ఇన్సా స్టోరీ లో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇది ఎవరిని ఉ ద్దేశించి చేసిందో తెలియదు కానీ.. నెటిజన్స్ మాత్రం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత త్రిష రాజకీయాల్లో తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తోంది. పైగా కొంతమంది రాజకీయ ప్రముఖులు డైరెక్ట్ గానే త్రిష పేరును ప్రస్తావిస్తూ.. డబుల్ మీనింగ్ డైలాగులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు.. సడన్గా త్రిష ఇప్పుడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ పంచుకుంది. "ఈ వయసులో అనవసరమైన డ్రామాలు చేయడం సిగ్గుచేటు.. వెళ్లి పనిచేసుకొని కొంత డబ్బు సంపాదించండి.. ప్రశాంతంగా జీవించండి". అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టింది. దీంతో అసలు త్రిష ఎవరిని ఉ ద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది ? అనే చర్చ మొదలయ్యింది.