దేశభక్తి అంశాలతో కూడిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' ఓ ట్రెండ్ సెట్ చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సీక్వెల్ ' ధురంధర్ 2' కూడా బాక్సాఫీసు వద్ద దూసుకెళుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు రాకేశ్ బేడీ ఈ విజయంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ రెండు సినిమాల్లో కీలకమైన జమీల్ జమాల్ పాత్ర పోషించిన ఆయన.. తన పెర్ఫామెన్స్‌పై హీరో రణ్వీర్ సింగ్ ఇచ్చిన ప్రశంసను గుర్తుచేసుకున్నారు. ఈ చిత్ర బృందమంతా సెట్స్‌లో కలివిడిగా ఉండేది. నా పాత్ర షూటింగ్ పూ-ర్తయిన రోజు.. రణ్ వీర్ మైక్ తీసుకొని 'ఒకవేళ ఈ మూవీ రూ. 1000 కోట్లు వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్ వల్లే వస్తాయి' అని చెప్పారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలి?' అని పేర్కొన్నారు. సీనియర్ పొలిటీషియన్‌గా నయవంచక పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టారు. ముఖ్యంగా 'ధురంధర్ 2'లో ఈ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు ఓ ట్రీట్. బాలీవుడ్లో 47 ఏళ్ల ప్రస్థానం రాకేశ్ బేడీది. 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్యధర్ గతంలో తెరకెక్కించిన మరో హిట్ మూవీ 'ఉరి: ది సర్జికల్ స్ట్రెక్'లోనూ నటించారు. సినీప్రియుల ఆసక్తిని దృష్టిలోపెట్టుకొని 'ధురంధర్ 2'ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. నెట్ వరంగా రూ.145 కోట్లు అని పేర్కొన్నాయి. ఇందులో దాదాపు రూ.100 కోట్లు హిందీలోనే రావడం గమనార్హం. పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ.40? కోట్లు వచ్చాయని తెలిసింది. నెట్ కలెక్షన్లలో వన్డే అత్యధిక వనూలు చేసిన బాలీవుడ్ మూవీగా 'ధురంధర్ 2' రికార్డులు నెలకొల్పింది.