డిసెంబర్ నెలలో తెలుగు ప్రేక్షకుల కోసం బాక్సాఫీస్ పండగే రాబోతోంది. బాలయ్య మాస్ అక్షన్ నుంచి హాలీవుడ్ స్కేల్ సైఫై వరకు, క్రిస్మస్కు భారీ ఫాంటసీ సినిమాల దాకా వరుసగా రిలీజులు క్యూలో ఉన్నాయి. అవేమిటో ఓ లుక్ వేద్దాం.
డిసెంబర్ 5: బాలయ్యతో గ్రాండ్ స్టార్ట్
డిసెంబర్ 5న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ అఖండకు సీక్వెల్‌గా రూపొందిన ‘అఖండ 2: తాండవం’ విడుదల కాబోతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, మైథలజికల్ టచ్, విజువల్ ఎఫెక్ట్స్ స్థాయిని మరింత పెంచాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకోవడంతో బాలయ్య ఫ్యాన్స్‌లో అపారమైన హైప్ క్రియేట్ అయ్యింది. సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు.
అదే రోజున బాలీవుడ్లో రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై-థ్రిల్లర్ ‘ధురంధర్’ కూడా థియేటర్లలోకి రానుంది. రియల్ ఈవెంట్స్ ఇన్స్పిరేషన్తో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా పాన్-ఇండియా లెవల్లో మంచి అటెన్షన్ తెచ్చుకుంటోంది, దీంతో ఒక్క రోజుకే నార్త్–సౌత్ మార్కెట్లలో భారీ క్లాష్ కనిపించనుంది.
ఇక ఆరోజునే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘కలంకావల్’ కూడా విడుదల కానుండడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడే కనిపిస్తోంది.
ఆ తరువాత కూడా..
వీటి తరువాత 12 న కార్తీ ‘అన్నగారు వస్తారు’, ‘మోగ్లీ’, ‘సైక్ సిద్ధార్థ్’ వంటి మూవీస్ రిలీజ్ కానున్నాయి. ఇవి కూడా మంచి అంచనాలతో రూపొందుతున్న ప్రాజెక్ట్స్. అంతే కాకుండా డిసెంబర్ రెండో, మూడో వారాల్లో సాధారణంగా మధ్యస్థాయి తెలుగు సినిమాలు, డబ్ ప్రాజెక్టులు, యూత్ టార్గెట్ చేసిన లవ్–అక్షన్ చిత్రాలు వరుసగా లైన్లోకి వస్తాయని డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరాన్ ‘అవతార్ 3’ హాలీవుడ్లో డిసెంబర్ 19న రీలీజ్ ప్లాన్‌లోనే ఉంది, దీనిని తెలుగు సహా పలు భారతీయ భాషల్లో డబ్ చేసి భారీ స్క్రీన్ కౌంట్‌పై విడుదల చేసే అవకాశాలపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మెగా మల్టీప్లెక్సులలో ఇంగ్లీష్ వెర్షన్‌తో పాటు తెలుగు డబ్డ్ ప్రింట్లకు కూడా మంచి షోలు ఇచ్చేలా ప్లానింగ్ జరుగుతుందని ఫిల్మ్ సర్కిల్ టాక్.
క్రిస్మస్కు ‘వృషభ’తో క్లైమాక్స్
డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున సినిమాల మోత మోగబోతోంది. మోహన్‌లాల్ హీరోగా, నంద కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘వృషభ’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదట అక్టోబర్, తరువాత నవంబర్ రిలీజ్‌గా ప్లాన్ చేసిన ఈ భారీ మలయాళ–తెలుగు బైలింగ్వల్ ప్రాజెక్ట్‌ను చివరికి క్రిస్మస్ సీజన్‌కి మార్చడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ ఫెస్టివ్ ఓపెనింగ్స్ కోసం నిర్మాతలు బలమైన క్యాల్కులేషన్ పెట్టారు. దీనితో పాటు ఛాంపియన్, శంబాలా ఇలా మరో ఐదు సినిమాలు అదే డేట్ కి బరిలో దిగుతున్నాయి.
వృషభ మూవీ ట్రైలర్, టీజర్ల ద్వారా ఈ సినిమా మిథాలజీ, రీబర్త్ కాన్సెప్ట్, ఎమోషనల్ ఫాదర్–సన్ డ్రామా కలగలిపిన విజువల్ స్పెక్టకిల్‌గా ప్రెజెంట్ అవుతుందనే హింట్స్ ఇప్పటికే వచ్చాయి. ‘వృషభ’తో పాటు మరికొన్ని మధ్యస్థాయి తెలుగు, డబ్ సినిమాలు కూడా అదే వారంలో థియేటర్ల బరిలోకి దిగే అవకాశం ఉండడంతో క్రిస్మస్ వీకెండ్‌కి స్క్రీన్ల కోసం గట్టి పోటీ తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది. అంటే బాలయ్య బాబు అఖండతో మొదలయ్యే సందడి మోహన్ లాల్ వృషభ తో డిసెంబర్ నెలకు క్లైమాక్స్ చూపించబోతోందన్న మాట.
డిసెంబర్ లో సందడి చేయనున్న పెద్ద అంచనాలున్న మూవీస్
|
సినిమా పేరు
|
హీరో
|
జానర్
|
విడుదల తేదీ
|
భాషలు / లక్ష్యం
|
|
అఖండ 2: తాండవం
|
నందమూరి బాలకృష్ణ
|
మైథలజికల్ అక్షన్
|
5 డిసెంబర్ 2025
|
తెలుగు (పాన్–ఇండియా రన్)
|
|
ధురంధర్
|
రణ్వీర్ సింగ్
|
స్పై పీరియడ్ థ్రిల్లర్
|
5 డిసెంబర్ 2025
|
హిందీ (పాన్–ఇండియా రిలీజ్)
|
|
అవతార్ 3
|
–
|
సైఫై ఫ్యాంటసీ
|
డిసెంబర్ 19 (గ్లోబల్ ప్లాన్)
|
ఇంగ్లీష్ + డబ్ భాషలు (తెలుగు సహా అంచనా)
|
|
వృషభ
|
మోహన్‌లాల్
|
ఫాంటసీ అక్షన్ డ్రామా
|
25 డిసెంబర్ 2025
|
మలయాళ–తెలుగు బైలింగ్వల్ (హిందీ, కన్నడ డబ్)
|