తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రను రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ భగ్నం చేసినట్లు సమాచారం. ఈ కుట్రలో 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ఒకేసారి రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్లాన్ చేశారని వెల్లడైంది. ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగి ఉన్నారు. ఈ కుట్రలో డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ లింక్ ఉ న్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఈ కుట్ర బయటపడింది. ఉత్తంగరై నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్. ఇళయరాజా ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఒక కన్సల్టెన్సీ సంస్థ ఐపీడీఎస్ నుంచి వచ్చిన వ్యక్తి ఇళయరాజాకు 35 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చాడని ఆయన ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఓటు వేయాలని, దానికి బదులుగా భారీ మొత్తం ఇస్తామని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నట్లు కూడా ఆయన ఆరోపించారు. పోలీసు విచారణలో మొదట చెన్నైలో ఒకరిని, తర్వాత కరూర్ నుంచి మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని విచారిస్తున్నారు. అరెస్టు అయిన వారిలో ఒకరు డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, అతని సోదరుడు అశోక్‌లకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. కానీ సెంథిల్ బాలాజీపై ఇంకా నేరుగా ఆరోపణలు చేయలేదు. కుట్ర విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు విచారణ జరుగుతోంది. మంత్రి సి.టి. నిర్మల్ కుమార్ డీఎంకేను తీవ్రంగా విమర్శించారు. సెంథిల్ బాలాజీతో సంబంధం ఉన్నవారు, కరూర్ గ్యాంగ్‌కు చెందినవారు ఈ కుట్రలో పాల్గొన్నట్లు ఆరోపించారు. పోలీసులు అందరినీల అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎంకే, ఏఐఏడీఎంకే నాయకులు కలిసి టీవీకే ఎమ్మెల్యేలను డబ్బు ఆఫర్లతో మభ్యపెట్టి రాజీనామాలు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రూ.10 కోట్లు నుంచి రూ.50 కోట్ల వరకు ఆఫర్లు ఇచ్చారని, ఎమ్మెల్యేలందరినీ సంప్రదించారని చెప్పారు. ఇందుకు డీఎంకే నాయకులు ఎం.కే. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీ చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
ఆధారాలు ఉంటే బాలాజీని అరెస్టు చేయండి
డీఎంకే మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. టీవీకే సృష్టించాలని చూస్తోందని డీఎంకే అధికార ప్రతినిధి ఎ.బి విచారణ వివరాలు లీక్ చేసి ప్రజల్లో తప్పుడు అభిప్రాయం శరవణన్ ఆరోపించారు. ఆధారాలు ఉంటే సెంథిల్ బాలాజీని అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. విజయ్, సెంథిల్ బాలాజీ మధ్య దీర్ఘకాలిక వ్యక్తిగత వైరం ఉంది. ఎన్నికల సమయంలో కరూర్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగినప్పుడు సెంథిల్ బాలాజీ కుట్ర చేశారని విజయ్ ఆరోపించారు. బాలాజీ దానిని ఖండించారు. ఈ నేపథ్యంలో ఈ కుట్ర ఆరోపణలు వచ్చాయి. పోలీసు విచారణ కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు, ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీసింది.