ఆర్వోబీ, ఆయుష్ మెడికల్ కాలేజీపై ప్రత్యేక దృష్టి
చేనేత, మత్స్యకారుల సంక్షేమ పనులకూ ప్రాధాన్యం
పిఠాపురం ప్రగతిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష
అమరావతి : కేరళలో చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పనులపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ శాఖల పరిధిలో చేపట్టిన పనుల స్థితిగతులు, పెండింగ్ అంశాలపై ఆరా తీశారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఉ పయోగవడే వనులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి చేసి అందుబాటు లోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. పాఠశాలల రక్షణ గోడలు, అదనపు తరగతి గదులు, ఆటస్థలాల అభివృద్ధి పనుల పురోగతిని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల ఆప్ గిడేషన్, అదనపు తరగతి గదులు, ఆటస్థలాలు, రక్షణ గోడల కోసం రూ.8.5 కోట్లతో చేపట్టిన పనుల వివరాలను అధికారులు వెల్లడించారు. యు.కొత్తపల్లి మండలం మూలపేట జిల్లా పరిషత్ పాఠశాలలో రూ.1.36 కోట్లతో నిర్మించనున్న ఎనిమిడి అదనపు తరగతి గదుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు, అభివృద్ధి వసులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. వీధి దీపాలు, సీసీ డ్రైనేజ్‌లు, రోడ్లు, తాగునీరు, పారిశుధ్య ననుల పురోగతిని అధి కారులు వివరించారు. ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను గుర్తించి అక్కడి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు. శ్మశాన వాటికల్లో ట్యాపులు, తాగునీరు, పారిశుధ్యం వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని, ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లోని శ్మశాన వాటికలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పీఠావురం మున్సిపాలిటీలో సుమారు రూ.300 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గొల్లప్రోలు మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, పారిశుధ్యానికి సంబంధించి రూ.100 కోట్ల పనులు చేపట్టినట్లు వివరించారు.
రూ.30.66 కోట్లతో చేవడుతున్న ఆలయాల అభి వృద్ది పనులపై సమీక్షించారు. 24 దేవాలయాల పునరుద్ద రణకు రూ.17.06 కోట్లు, టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు, 18 భజన మందిరాల అభివృద్ధికి రూ.11.60 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పెండింగ్ ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి నిర్మాణాన్ని ము తీసుకెళ్లాలని పవన్ ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తిచేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలనిడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.