శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ నిలిపివేత
అమెరికా ఉద్యోగుల భద్రతకై నిర్ణయం
రెండు సంస్థలపై దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: మోసాలపై ట్రంప్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్న వేళ ప్రముఖ ఐటీ సంస్థ 'కాగ్నిజెంట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రీన్ కార్డు పొందడానికి తొలి మెట్టుగా భావించే శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ (పీఈఆర్ఎం) ఫైలింగ్స్‌ను అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది. కాగ్నిజెంట్‌తో పాటు, క్లౌడెరా సంస్థల శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను సస్పెండ్ చేసినట్లు అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి' ఎస్పోసిటో ప్రకటించారు. అమెరికా ఉద్యోగులకు ముప్పు వాటిల్లితే సహించేది లేదని పేర్కొన్నారు. వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్, ఇతర ఉన్నతాధికారుల సమన్వయంతోనే ఈ రెండు సంస్థలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారంపై అమెరికా కార్మిక శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది. వైట్ హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి వాస్తవాలు, మోసం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను లోతుగా వరిశీలిస్తున్నామని ఆంథోనీ డి'ఎస్పోసిటో తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. "కాగ్నిజెంట్ పెర్క్ ఫైలింగ్ ను నిలిపివేశాం. వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి వాస్తవాలు, మోసం, ఆర్థిక లావాదేవీలను వరిశీలిస్తున్నాం. నేరస్థులకు సంకెళ్లు సిద్ధంగా ఉన్నాయ" అని డి'ఎస్పోసిటో పేర్కొన్నారు. కాగ్నిజెంట్, క్లౌడెరా సంస్థల పెర్క్ ప్రక్రియను ఎందుకు నిలిపివేశారనే దానిపై దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్మిక శాఖ అధికారులు సంబంధిత రికార్డులు, ఫైలింగ్స్, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాసం అంటే గ్రీన్ కార్డు కోసం యాజమాన్యాలు అనుసరించే ముఖ్యమైన ప్రక్రియే ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రిప్యూ మేనేజ్మెంట్. విదేశీ డి ద్యోగిని శాశ్వతంగా నియమించుకునే ముందు ఆ ఉ ద్యోగానికి అర్హత కలిగిన అమెరికా కార్మికులు అందుబాటులో లేరని యాజమాన్యం నిరూపించాల్సి ఉ ంటుంది. అంతేకాకుండా విదేశీ ఉద్యోగిని నియమించడం పల్ల అమెరికా కార్మికుల వేతనాలు, ఉద్యోగ అవకాశాలు, పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉండదని కూడా నిర్ధరించాలి. ఈ ప్రక్రియను అమెరికా కార్మిక శాఖ పరిశీలించి అనుమతి ఇస్తుంది. ఆ తర్వాతే గ్రీన్‌కార్డు కోసం ఉద్యోగి తరఫున తదుపరి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. భారత్‌కు చెందిన అనేక మంది ఐటీ నిపుణులు అమెరికాలోని టెక్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరిలో కొందరు దీర్ఘకాలికంగా అమెరికాలో ఉండేందుకు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కంపెనీలు ఉద్యోగుల తరఫున ప్రక్రియను చేపడతాయి, ఇలాంటి పరిస్థితుల్లో కాగ్నిజెంట్ ఫైలింగ్స్ నిలిపివేయడం సంస్థలోని విదేశీ ఉ ద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అప్పటికే గ్రీన్‌కార్డు ప్రక్రియలో ఉన్న ఉద్యోగులకు ఈ పరిణామం ఆందోళన కలిగించవచ్చు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు సంస్థకు సంబంధించిన అన్ని కేసులపై తుది ప్రభావం ఎలా ఉంటుందనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ట్రంప్ ప్రభుత్వం వీసా కార్యక్రమాల్లో అక్రమాలు, మోసాలపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. జులైలోనే ఉపాధి వీసా కార్యక్రమాలకు సంబంధించిన మోసం ఆరోపణలపై పెద్ద స్థాయి దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం. అమెరికా ఉ ద్యోగుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమపుతున్నారు. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్, క్లౌడెరాపై తాజా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.