విచారణకు వీసీ ఆదేశం
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ గాయం వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. మ్యాచ్ మధ్యలో కాలి కండరాలు వట్టేయడంతో అతను రెండు ఇన్నింగ్స్ లోనూ బ్యాటింగ్‌కు రాలేదు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విచారణకు ఆదేశించడంతో పాక్ క్రికెట్లో కలకలం రేగింది. లార్డ్స్ జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 194 వరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి తర్వాత పాక్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఆకిబ్ జావేద్ ఈ విషయంపై స్పందించాడు. "కేవలం కండరాలు పట్టేసిన గాయంతో ఒక ఆటగాడు రెండు ఇన్నింగ్స్ లో ఎలా బ్యాటింగ్ కు రాలేకుండా ఉంటాడు? ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుగుతుంది" అని ఓ స్థానిక టీవీ ఛానెల్ అన్నాడు. "గతంలో ఆటగాళ్లు ఫ్రాక్చర్లతో కూడా జట్టు కోసం మైదానంలోకి వచ్చారు. ఇది చాలా తీవ్రమైన విషయం, విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశాడు. మరోవైపు, పీసీబీ విచారణను ఎదుర్కోవడానికి ఇమామ్ న్యాయవాది సహాయం తీసుకునే అవకాశం ఉందని పీటీఐ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ పరిణామంతో ఇమామ్ తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. సిరీస్‌లో వరుస ఓటముల నేపథ్యంలో పీసీబీ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇమామ్ తో పాటు మరో ఆరుగురు ఆటగాళ్లను, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గులు వెంటనే ఇంగ్లండ్ నుంచి వెనక్కి పిలిపించింది. సెప్టెంబర్ 9న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్న ఆఖరి టెస్టుకు వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెన్సన్, బౌలింగ్ కోచ్ యాష్లే నోఫ్కే తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మ్యాచ్ కోసం పాక్ సెలక్టర్లు ఐదుగురు అన్ క్యాప్ట్ ఆటగాళ్లతో కూడిన యువ జట్టును ఎంపిక చేశారు. ఈ మొత్తం వ్యవహారం పాకిస్థాన్ క్రికెట్లో ప్రక్షాళనకు దారితీసింది.