సంప్రదాయ ముగ్గుల పోటీలు..
ఎడ్ల బండ్లపై ఊరేగింపు
స్థానిక చిన్నారులకు ఆటల పోటీలు..
పాల్గొన్న దేవాన్షి గంగిరెద్దుల విన్యాసాలతో సందడిగా నారావారి పల్లె
కుప్పం: సంస్కృతి, సంప్రదాయలు చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి పండగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా పాల్గొంటున్నారు. వంసనగా రెండోరోజు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు భార్య భువనేశ్వరితో సహా కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఇక బుధవారం భోగి పండగ వేళ.. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినీ, శ్రీభరత్ దంపతుల పిల్లలు ఎద్దుల బండిలో ఊరేగారు. ఈ సందర్భంగా ఎద్దుల బండిని బెలూన్లతో అందంగా అలంకరించారు. ఈ ఎద్దుల బండిపై వారు వారంతా
అటుఇటు తిరిగారు. దేవాన్స్ తోపాటు శ్రీభరత్ దంపతుల చిన్నారులు సైతం ఈ సందర్భంగా గ్రామంలోని పిల్లలందరికీ చేతులు ఊపుతూ ఎద్దుల బండిలో తిరిగారు. అనంతరం ఈ ఎడ్ల బండి దిగి.. స్థానికంగా ఉన్న చిన్నపిల్లకు వీరు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పిల్లల్లో ఆనందం వెల్లువిరిసింది. తన స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రి నారా లోకేశ్ స్వగ్రామానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
నాలుగు రోజులపాటు వీరు స్వగ్రామంలోనే ఉండి.. సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు. మంగళవారం ఉదయం స్వగ్రామంలో ఏర్పాటు చేసిన.. ముగ్గుల పోటీలను సీఎం సతీమణి నారా భువనేశ్వరితోపాటు నారా బ్రాహ్మణి పరిశీలించారు. లాగే చిన్నారులకు ఆటల పోటీలు.. మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్స్ ంట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో భారీగా బాలురు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. అలాగే గ్రామస్తుల నుంచి అర్జీలను సీఎంతోపాటు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారికి తండ్రి తనయులు భరోసా ఇచ్చారు. ఇక మంగళ వారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.నాలుగు రోజులపాటు ఈ సంబరాల్లో పాల్గొని సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.