తమిళనాడు కొత్త సీఎం విజయ్ - మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తో భేటీ అయ్యారు. టీవీకే చీఫ్ సోమవారం డీఎంకే అధినేత నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాలిన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ఈ నేతలు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఖజానాను గత డీఎంకే ప్రభుత్వం ఖాళీ చేసిందని ఇప్పటికే విజయ్ ఆరోపించారు. దీనికి స్టాలిన్ కూడా బదులిచ్చారు. అప్పులు వరిమితికి లోబడే ఉ న్నాయన్నారు. కొవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొని, నిధులు ఇవ్వడంలో అడ్డంకులు సృష్టించిన భాజపాను తట్టుకుని దీటుగా నిలబడ్డామని తెలిపారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీవీకే విజయ్ నేతృత్వంలో ఆదివారం తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మే 13న ఈ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. మరోవైపు నేడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. సిఎం విజయ్ ముందుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిన్న మంత్రిగా ప్రమాణం చేసిన యువనేత కీర్తన.. నేడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. ఎలక్షన్ సర్టిఫికేట్‌ను తీసుకురాకపోవడమే అందుకు కారణం. తర్వాత వెనక్కి వెళ్లిన ఆమె దానిని తీసుకొచ్చి, సమర్పించడంతో ఎట్టకేలకు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇకపోతే సాధారణ స్థాయి నుంచి వచ్చానంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమం నుంచి నిరాడంబరతను చాటుకుంటున్న విజయ్ వరుస ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. చెన్నైలోని ఎండీఎంకే చీఫ్ వైకో ను సోమవారంనాడు ఆయన నివాసానికి వెళ్లి విజయ్ కలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ఫోటోలు దిగారు. అనంతరం వైకో ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందిని సైతం ఆత్మీయంగా పలుకరించడంతో వారు ఉద్వేగానికి లోనయ్యారు. విజయ్ నిరాడంబరతకు ఇది నిదర్శనమంటూ ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైకో ఇంటికి వచ్చిన విజయ్‌కు ఆయన సాదర స్వాగతం పలికారు. తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. అనంతరం తన ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందిని పరిచయం చేస్తూ, వీరంతా విజయ్‌కు పెద్ద అభిమానులనీ, విజిల్ గుర్తుకే ఓటు వేశారని చెప్పడంతో అక్కడ అహ్లాద వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడిని అంత దగ్గరగా చూడటంతో వారు ఉద్వేగానికి లోనయ్యారు. విజయ్ సైతం ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. విజయ్ సాధారణ వ్యక్తిత్వం, నిరాడంబరతకు ఇది నిదర్శనమంటూ నెటిజెన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వైకో పట్ల విజయ్ సైతం తన అభిమానాన్ని చాటుకున్నారు. వైకో ప్రసంగాలు, రాజకీయ సామర్థ్యాన్ని ప్రశంసించారు. 'నేను మీ అభిమానిని' అంటూ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తొలి రాజకీయ ప్రసంగం విక్రవాండిలో చేశానని, ఆ ప్రసంగానికి ముందు తాను వైకో ప్రసంగాలను పదేపదే చూశానని తెలిపారు.
ఆర్థిక పరిస్థితిపై దిగజారి మాట్లాడవద్దు...కొత్త సీఎం విజయ్ కు స్టాలిన్ హెచ్చరిక
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలకు దిగాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే. స్టాలిన్ విజయ్ ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక వనితీరును విమర్శించడంపై సీఎం విజర్‌ను హెచ్చరించారు స్టాలిన్. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న విజయ్ మాటల్ని తప్పుబట్టిన ఆయన.. అబద్దపు ప్రచారాలు ఆపాలంటూ చురకలంటించారు. 'ప్రభుత్వం వద్ద డబ్బులేదని వెంటనే చెప్పడం ప్రారంభించవద్దు. డబ్బు ఉ ంది.. కావాల్సింది దానిని ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం,పాలించే సామర్థ్యం. ఐదేళ్లుగా కొవిడ్, వరదల వంటి సంక్షోభాలు సహా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పోరాడుతూనే.. మేం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం. 'గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పును వదిలేసి ఖజానాను ఖాళీ చేసింది' అనే ఆరోపణను మీ మొదటి ప్రసంగంలోనే ప్రస్తావించారు. నిజానికి రాష్ట్రంలో అప్పు పరిమిత స్థాయిలోనే ఉంది. ఫిబ్రవరి బ్లడెట్లోనే మేం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా వివరించాం. ఆ విషయం మీకు తెలియదా? మీకు ఓటు వేసిన ప్రజలను మోసం చేసి.. విషయాన్ని పక్కదారి వట్టించే ప్రయత్నం చేయవద్దు! 'ఆచరణాత్మకంగా సాధ్యమయ్యే వాగ్దానాలు మాత్రమే ఇస్తాను' అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు.. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పాలనను ప్రారంభిస్తున్నారు. మాలాగే మీరు కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలనే మెళకువలను త్వరలోనే తప్పకుండా నేర్చుకుంటారని నమ్ముతున్నాను. మీకు ఓటు వేసిన ప్రజలతో పాటు నేనూ అదే ఆశిస్తున్నాను. మీ పాలనలో తమిళనాడు అభివృద్ధి ప్రస్థానం కొనసాగాలని మరోసారి నా శు భాకాంక్షలు!' అని తన సందేశాన్ని ముగించారు స్టాలిన్. కాగా.. కేంద్రంలో డీఎంకేకు చిరకాల మిత్రపక్షమైన కాంగ్రెస్ మద్దతుతో నిన్న (ఆదివారం) టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం విజయ్‌కు ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు స్టాలిన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ సంతకం చేసిన ప్రకటనలను కూడా ఆయన స్వాగతించారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉ చిత విద్యుత్, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం వంటివి ప్రధాన ప్రకటనలలో ఉన్నాయి.