సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ భేటీ
సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరు పరిశీలన
ఉండవల్లిలోని ఏఐ ఆధారిత వ్యవసాయ క్షేత్రంలోనూ పర్యటన
అమరావతి: గేట్స్ ఫౌండే షన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి వస్తు న్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు, ఉ పముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో ఆయన సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నిర్వహి స్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది. ఉ దయం 10 గంటలకు సచివాలయంలోని ఆర్టీజీఎస్కు చేరుకుని వాట్సప్ ద్వారా మనమిత్ర పేరిట పౌరులకు అందిస్తున్న 800కుపైగా సేవల గురించి తెలుసుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తుగా సమాచారం ఇవ్వడం ద్వారా ప్రాణ నష్టాన్ని ఎలా నివారిస్తున్నామో బిల్ గేట్స్‌కు లోకేశ్ వివరిస్తారు. ఇందుకు ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన తుఫానులు, వాటి ప్రభావంతో జరిగిన నష్టాలను నామమాత్రం చేయడం వంటి అంశాలను కూడా బిల్ గేట్స్ బృందానికి లోకేశ్ వివ రించనున్నారు. సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలోని పచ్చటి అరటితోటలో గేట్స్‌తో చర్చలకు వేదికని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయన సంజీవని ప్రాజెక్టు గురించి చర్చించడంతో పాటు టెక్నాలజీని వినియోగించి సాగు చేస్తున్న రైతులతోనూ సమావేశం అవుతారు.
2020... 2047
గతంలో విజన్-2020 లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని పాలన సాగించిన చంద్రబాబు ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్-2047 లక్ష్యాన్ని గురించి గేట్స్‌కు వివరించనున్నారు. దీనిలోభాగంగా ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య వంటి ప్రధానాంశాల్లో చేపట్టాల్సిన కార్యక్ర మాలను గురించి వివరిస్తూనే.. ఈ కార్యక్రమాల అమలులో బిల్ గేట్స్ పౌండేషన్ సహకారాన్ని కోరనున్నారు. విద్య, వైద్యం, వ్యవ సాయ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా నడుస్తోన్న సంజీ వని ప్రాజెక్టు గురించి చెప్పనున్నారు. తర్వాత ఉండవల్లిలో వ్యవ సాయ క్షేత్రాన్ని గేట్స్ పరిశీలిస్తారు. ఇక్కడ కృత్రిమ మేద సహ కారంతో చేస్తున్న సాగు గురించి బిల్ గేట్స్ తెలుసుకుంటారు. ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర అధికారులు బిల్ గేట్స్‌తో సమా వేశం జరిగే అరటి తోట పరిసర ప్రాంతాలను సందర్శించారు.
సామాన్యుడి చెంతకు అంతర్జాతీయ వైద్య సేవలు
ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవం ద్వారా సామాన్యులకు మెరుగైన, సత్వర వైద్యసేవలందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలోని ఆరోగ్యవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయరంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఇప్పటికే ఇస్తున్నసహకారంతోపాటు టెక్నాలజీ పరంగా మరింత సహకారం అందించేక్రమంలో సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు నేడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ వస్తున్నారు. ఈసందర్భంగా ఆయన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలవుతున్న ఆధునిక పద్దతులు, పాటించాల్సినవిధానాలపై ప్రభుత్వానికి కీలకసూచనలు చేయనున్నారు. ముఖ్యంగా జబ్బుల బారినపడిన వారికి వైద్యం అందించే సంప్రదాయ విధానానికి భిన్నంగా.. వ్యాధులు సోకడాన్ని ముందుగానే పసిగట్టి, వాటి నివారణా చర్యలతో పాటు ప్రజల ప్రస్తుత ఆరోగ్య స్థితిగతుల్ని వ్యక్తిగతంగా సమగ్రంగా పరీక్షించి, వారికి జబ్బులొచ్చే అవకాశాన్ని ముందుగానే హెచ్చరికలు చేయడం, వ్యక్తిగత హెల్త్ కార్డుల్ని రూపొందించడం, డిజిటల్ ఆరోగ్య సేవలు (టెలిమెడిసిన్) అందించే దిశగా వైద్య ఆరోగ్య వ్యవస్థను ప్రక్షళన చేయాలన్న అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు ఉన్న విధానాలు, పద్ధతులను సమగ్రంగా సమీక్షించి ఆరోగ్యాంధ్ర సాధనకు చేపట్టాల్సిన విధానాలపై నివేదించేందుకు గేట్స్ ఫౌండేషన్ సూచనల మేరకు 10 మంది అంతర్జాతీయ నిపుణులతో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై సీఎం చంద్రబాబు బిలేట్స్కు వివరించనున్నారు. అంతేకాకుండా గేట్స్ ఫౌండేషన్ సూచించిన మేరకు వివిధ పథకాల అమలుకు భాగస్వామ్యుల ద్వారా కార్యాచరణను ప్రారంభించడంతో పాటు ఇంటిగ్రేటేడ్ విధానంలో సాంకేతిక సహకారంతో వివిధ ఆరోగ్య కేంద్రాల సమన్వయంతో రియల్ టైమ్‌లో ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ప్రత్యేకంగా సంజీవని వథకాన్ని ప్రారంభించింది. చిత్తూరు జిల్లా కుప్పంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేసి, ఇప్పుడు చిత్తూరు జిల్లాకు విస్తరించింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనికి గేట్స్ ఫౌండేషన్ సహకారం మరింత కావాలని ప్రభుత్వం కోరనుంది.
ఆపై ఆరోగ్యశాఖను ఆర్టీజీఎసలోని అవేర్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేసి వ్యాధులు ప్రబలటాన్ని ముందుగానే పసిగట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేవడుతుంది. స్థూలంగా డేటా ఆధారిత ముందస్తు వ్యూహాలు, విధానాల రూపకల్పనకు గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం తోడ్పడుతుంది. ఏఐ ఆధారిత డయగ్నోస్టిక్ పరీక్షలు, సంచార పరీక్షా కేంద్రాల్లో సులువుగా నిరంతరం వాడే పరికరాలు, దూర ప్రాంతాల్లో వైద్యం, టెలిమెడిసిన్ క్కు సంబంధించిన ఉపకరించే పరికరాల ఎంపికకు గేట్స్ ఫౌండేషన్ టెక్నికల్ సపోర్టు అందిస్తుంది.
వైద్య రంగంలో టెక్నాలజీ అవసరం: సత్యకుమార్
వైద్య రంగంలో ఆశించిన మార్పులను సాధించడానికి, వైద్యం అందరికీ సులువుగా అందించడానికి టెక్నాలజీ సహకారం ఎంతో అవసరం. ఈ దిశగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ముందుకు సాగుతున్నాం.. ఇందులో భాగంగాఏఐ ఆధారిత జాతీయ విధాన రూపకల్పన దిశగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విజయవాడలో వివిధ రాష్ట్రాలతో మొదటి విడత చర్చల జరిపాం. ఆరోగ్యశాఖకు టెక్నాలజీ అనుసంధానంపై ఫౌండేషన్ సహకారం తీసుకుంటాం.