శ్రీవారి విశిష్టతను వివరించిన చంద్రబాబు
ఇంట్లోని నిలువెత్తు విగ్రహం చూపించిన బాబు
వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి పంటలపై ఆసక్తి కనబర్చిన బిల్ గేట్స్
అమరావతి: గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై బిలేట్స్ ప్రశంసలు కురిపించారు. 'నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు. గేట్స్‌పై ఉన్న గౌరవంతో మంత్రి నారా లోకేశ్‌తో సహా నలుగురు మంత్రులను సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్ర యానికి పంపించి స్వాగతం పలికారు. సచివాలయం లో మొదటి బ్లాకులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్ర బాబు బిలేట్స్క ఆత్మీయ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబును చూడగానే కారు దిగుతూనే 'హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ'.. అంటూ ముఖ్యమంత్రిని పలకరించారు గేట్స్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సహా ఇతర క్యాబినెట్ మంత్రులను బిలేట్స్కు సీఎం చంద్రబాబు పరిచయం చేశారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా తన ఛాంబర్లోకి వచ్చిన బిలేట్స్కు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు చిత్రపటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించారు. శ్రీవారి ప్రాశస్త్యాన్ని, తిరుమల క్షేత్రం గొప్పదనాన్ని బిల్ గేట్స్క వివరించారు సీఎం. గేట్స్ ఫౌండేషన్ బృందంతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనంతరం ఆర్టీజీ సెంటర్‌కు గేట్స్‌ను తీసుకెళ్లారు ముఖ్యమంత్రి. తర్వాత ఆ విభాగం పనితీరును వివరించారు. పాలనా వ్యవహరాలు, విపత్తుల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విషయంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకుంటున్నా మనే అంశాన్ని ఉ దాహరణలతో సహా వివరించారు ముఖ్యమంత్రి. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కుప్పంలో చేపట్టిన సంజీవని ప్రాజెక్టు ప్రోగ్రెస్‌ను ముఖ్యమంత్రి వివరించగా.. దట్స్ నైస్ అంటూ మెచ్చుకున్నారు బిల్ గేట్స్. ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగంపై గ్రేట్ అంటూ గేట్స్ అభినందనలు తెలిపారు. డేటా లేక్, రాజధాని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడంపై బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాధి నిర్దారణ పరీక్షలు తక్కువ ధరకే అందించగలిగితే.. పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్‌ను, అత్యాధునిక పద్దతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. గ్రేట్‌వర్క్ అంటూ రాజధాని మాస్టర్ ఎ+-లాన్‌ను మెచ్చుకున్నారాయన. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళికలతో రాజధాని నిర్మిస్తున్నామనే విషయాన్ని వివరించారు సీఎం. రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా.. ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు బిల్ గేట్స్క చెప్పారు సీఎం. అనంతరం మంత్రులు, సెక్రటరీల సమావేశానికి గేట్స్‌ను తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, లక్ష్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఉండవల్లిలోని వ్యవసయా క్షేత్రాన్ని పరివృలించారు. అక్కడ పండించిన పంటలను పరిశీలించి అభినందించారు.