టాలీవుడ్ సెన్సేషన్, బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన దివి, అదిరిపోయే ఫిగర్, చంపేసే చూపులతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా బులెట్ బైక్ పక్కన జీన్స్ స్కర్ట్ వేసుకుని, తన నడుము వంపులను ప్రదర్శిస్తూ ఆమె ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. సోకులతో కట్టిపడేస్తున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ హాట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం.. దివి వైద్య కెరీర్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమాతో మొదలైనప్పటికీ, ఆమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం బిగ్ బాస్ సీజన్ 4. ఆ షోలో ఆమె చూపించిన మెచ్యూరిటీ, గ్లామర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆమెను మెచ్చుకోవడంతో దివి పేరు ఇండస్ట్రీలో మార-మోగిపోయింది. అప్పటి నుండి ఈ ముద్దుగుమ్మ వరుస ప్రాజెక్టులతో, అడపాదడపా సినిమాల్లో మెరుస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేసన్ను క్రియేట్ చేసుకుంది. తాజాగా దివి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు యూత్‌ను పిచ్చెక్కిస్తున్నాయి. స్టైలిష్ జీన్స్ స్కర్ట్ ధరించి, బులెట్ బైక్ పక్కన నిలబడి రకరకాల యాంగిల్స్ లో ఫోజులిచ్చింది. ఆమె నడుము అందాలు ఈ ఫోటోషూట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మోడలింగ్ రంగంలో రాణించిన అనుభవం ఉండటంతో, ఏ డ్రెస్‌లో ఎలా కనిపించాలో దివికి బాగా తెలుసు. ఇక అందుకే ఆమె చేసే ప్రతి ఫోటోషూట్ ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారుతోంది.