దేశంలో మొట్టమొదటి సహకార టాక్సీ సేవ అయిన భారత్ టాక్సీ మంగళవారం ఢిల్లీలో పైలట్ కార్యకలాపాలను ప్రారంభించింది. కార్లు, ఆటోలు, బైక్లకు సేవలు ప్రారంభం అయ్యాయి. 51,000 కంటే ఎక్కువ మంది డ్రైవర్లు ఈ యాప్లో నమోదు చేసుకున్నారు. ఈ సేవ ఎనిమిది ప్రధాన సహకార సంస్థల మద్దతుతో ప్రారంభం అయింది . ఆ సంస్థలు MUL, IFFCO, KRIBHCO, NAFED, NDDB, NCEL, NCDC, NABARD.
ఈ టాక్సీ యాప్ జూన్ 6, 2025న మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీగా నమోదు అయిన సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ సర్వీస్ జీరో కమీషన్ మోడల్ డ్రైవర్ పూర్తి ఆదాయాన్ని పొందేలా చేస్తుంది. లాభాలు కూడా డ్రైవర్లకు పంపిణీ అవుతాయి.
ఢిల్లీలో పైలట్ ప్రోగ్రాం.. గుజరాత్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం..
ఢిల్లీలో పైలట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని సహకార్ టాక్సీ చైర్మన్ జయేన్ మెహతా తెలిపారు. గుజరాత్లో డ్రైవర్ రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ఇది త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. బోర్డుకు ఇద్దరు డ్రైవర్ ప్రతినిధులు కూడా ఎన్నికయ్యారు. మార్చి 2025లో, హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రైవేట్ కంపెనీల నుండి డ్రైవర్లను విడిపించడానికి కొత్త సహకార టాక్సీ సేవను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
భారత్ టాక్సీని ఎవరు నడుపుతారు?