ఆర్టీజీఎస్ ద్వారా సేవల విస్తృతి
ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు వివరణ
పౌరసేవల తీరు ప్రశంశనీయం
డేటా సంరక్షణ తదితర అంశాలపై ఆరా
ఆర్టీజీఎస్ ను బాబుతో కలసి సందర్శించిన గేట్స్
టెక్నాలజీ ఆధారిత సేవలపై బాబు వివరణ
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయని ప్రశంసలు
అమరావతి: మానవజీవనాన్ని మెరుగుపరిచేందుకు సేవ చేయాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పరిపాలనలో వేగాన్ని, వ్యాపార సౌలభ్యాన్ని ఆర్టీజీఎస్ అందిస్తోందని చెప్పారు. ప్రత్యక్షంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తోందని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. 1990లో బిల్ గేట్స్‌ను కలిసినప్పుడు సాంకేతికత ద్వారా పౌరసాధికారత సాధ్యమనే స్ఫూర్తి వచ్చింది. నాటి ఆలోచనలే ఇవాళ టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు బాటలు వేశాయి. ఆర్టీజీఎస్ ద్వారా ఇవాళ పలు కార్యక్రమాల ప్రదర్శన సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్దతకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం సంతోషంగా ఉందన్నారు. సమగ్ర స్థిర అభివృద్ధి కోసం ఫౌండేషన్ సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోందని పవన్ తెలిపారు. సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం వలకడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్‌న సోమవారం సందర్శించిన సంగతి తెలిసిందే. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని ఆయన పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్సు. ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.
పౌరసేవల తీరు ప్రశంశనీయం
డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించిన గేట్స్ చంద్రబాబును ప్రశసించారు. రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించగా.. గ్రేట్ వర్క్' అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న బిలేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్‌ను సోమవారం సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిలేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానిం చామని సీఎం వివరించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని ఈ సందర్భంగా బిలేట్స్ కితాబిచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరునూ పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్టీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి కూడా ఈ సందర్భంగా బిలేగేట్స్ ఆరా తీశారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ 'నైస్' అంటూ కొనియాడారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫెల్, ఆహారం తదితర అంశాల్లో నలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని సీఎం వివరించారు. అందుకు బిలేట్స్ 'గ్రేట్' అంటూ కితాబిచ్చారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలనూ బిల్‌గేట్స్ అడిగి తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స మఖ్యమంత్రి వివరించగా.. గ్రేట్ వర్క్ అంటూ కొనియాడారు.