బంగ్లాదేశ్ క్రిట్ బోర్డుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్లో తమ మ్యాచ్లు భారత్ నుంచి శ్రీలంకకు షిఫ్ట్ చేయాలన్న అభ్యర్ధనను అంతర్జాతీయ క్రిట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారమే భారత్లో వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడాలని, లేదంటే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయి-తే ఇటీవల భారత్- బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రైట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతాపరమైన కారణాలు చూపిస్తూ, తమ జట్టు, భారత్' లో ఆడాల్సిన వరల్డ్ కప్ మ్యాచ్' లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసింది. అయితే ఆ అభ్యర్ధననే ఐసీసీ తాజాగా తిరస్కరించినట్లు తెలిసింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్త వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్' లో బంగ్లాదేశ్ తమ గ్రూప్ దశ మ్యాచ్ లన్నీ భారత్' లోనే ఆడాల్సి ఉంది. అయితే ఇటీవల బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్'ను బీసీసీఐ ఆదేశాల మేరకు రీసెంట్'గా కేకేఆర్ జట్టు నుంచి వదిలేయండతో ఇరు దేశాల మధ్య వివాదం ముదిరింది. ఎలాంటి వివరణ లేకుండా తమ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్'ను ఐపీఎల్" నుంచి తప్పించడంతో బంగ్లా ఈ నిర్ణయం తీసుకుంది. తమ క్రిట్ జట్టును భారత్'కు వంవబోమని బంగ్లా క్రిట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ వివాదాల మధ్యే బంగ్లాదేశ్ ప్రపంచకప్ నకు తమ జట్టును ప్రకటించింది. 15 మండితో కూడిన బృందం పొట్టి కప్పు టోర్నీలో పాల్గొననున్నట్లు ప్రకటన చేసింది. ఈ జట్టుకు లిట్టన్ దాన్ ప్టెన్'గా వ్యవహరించనున్నాడు. ఇందులో ముస్తాఫిజుర్ రహమాన్ కూడా చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాలో దేశవాళీ టోర్నీ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతోంది. ఈ లీగ్'లో భారత్కు చెందిన రిధిమా పాఠక్ ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్నారు. అయితే భారత్- బంగ్లాదేశ్ వివాదాల నేపథ్యంలో రిధిమాను కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై రిధిమా స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తనను తొలగించారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవానేనని అన్నారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తానే స్వయంగా ప్యానెల్ నుంచి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. 'బంగ్లా ప్రీమియర్ లీగ్ నుంచి నన్ను తొలగించారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. బీపీఎల్ నుంచి వైదొలగాలని నేనే వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాను. నాకు దేశమే ముఖ్యం. తర్వాతే ఇంకేదైనా. నిజాయతీ, గౌరవం, అభిరుచితో కొన్ని సంవత్సరాలుగా క్రిట్కు సేవ చేసే అవకాశం నాకు లభించింది. దాన్ని మాత్రం కొనసాగిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు' అని రిధిమా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.