వచ్చే నెల భారత్‌లో జరిగే టీ-20 ప్రపంచ కప్పులో పాల్గొనడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైఖరి మారడం లేదు. భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని మరోసారి తేల్చిచెప్పింది. ఐసీసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. తాము ఆడే మ్యాచ్‌లను మరో దేశానికి తరలించాలన్న డిమాండ్‌ను పునఃపరిశీలించాలని బంగ్లాదేశ్‌ను ఐసీసీ కోరింది. భద్రతాపరమైన ఆందోళనలను మరోసారి ప్రస్తావిస్తూ ఈ విషయంలో తమ వైఖరి మారదని ఐసీసీకి చెప్పినట్లు జడీ తెలిపింది. తమ ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. టోర్నమెంట్ షెడ్యూల్ ఖరారు కావడం జట్లకు విమాన, హెూటల్ గదుల టికెట్లు బుక్ చేయడంతో బీసీసీ తన వైఖరి పునఃపరిశీలించుకోవాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ విషయంలో ఆమోదయోగ్యమైన పరిష్కారాల కోసం ఇరుపక్షాల చర్చలు కొనసాగుతాయని వెల్లడించింది. ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపుతూ తమ మ్యాచ్‌లను మరో దేశానికి మార్చాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు ఐసీసీకి డీజదీ విజ్ఞప్తి చేసింది. ఐసీసీ ఆ విజ్ఞప్తులను తిరస్కరిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా, భారత్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడడంలో బంగ్లా ఆటగాళ్లకు భద్రత పరంగా ఏ ఇబ్బందీ ఉండదని ఐసీసీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే భారత్‌కు తమ ఆటగాళ్లను పంపలేమనడానికి బీసీబీ చెబుతున్న కారణాల పట్ల సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. బంగ్లా ఆటగాళ్లకు భారత్‌లో ముప్పు వాటిల్లేందుకు ఆస్కారం పెద్దగా లేదని ఐసీసీ నివేదికలో ంది. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా తమ తేలింది. ఇక ఫిబ్రవరి 7న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌నకు భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యమిస్తోంది. షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్, 17న వాంఖడేలో నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉ దేశానికి రానందుకు, ఈ టోర్నీ కోసం పాక్ జట్టు భారత్' లో పర్యటించడం లేదు. తన మ్యాచ్? లను శ్రీలంకలో ఆడబోతోంది. మరోవైపు, కొద్దిరోజులుగా భారత్- బంగ్లా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులు, ఈ క్రమంలో బంగ్లా పేనర్? మ-ఎస్తాఫిజుర్ను ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో ఎంచుకోవడంపై భారత అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ అతడిని విడుదల చేయడంతో, భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ తమ మ్యాచ్" లను సైతం శ్రీలంకకు తరలించాలని బీసీబీ, ఐసీసీని కోరింది. కానీ, భారత్‌లో పరిస్థితులు, బంగ్లా ఆటగాళ్ల భద్రతపై తమ ప్రతినిధులతో అధ్యయనం చేయించింది ఐసీసీ. ఈ నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని బీసీబీకి స్పష్టం చేయనున్న నేపథ్యంలో బంగ్లా జట్టు టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. టోర్నీని బహిష్కరిస్తే ఆ జట్టు మ్యాచ్‌ల తాలూకు పాయింట్లు ప్రత్యర్థులకు వెళ్తాయి. అంతేకాదు ఐసీసీ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతకుముందు, బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్'ను ఐపీఎల్ నుంచి తప్పించడంతో వివాదం ముదిరింది. భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. తమ జట్టు మ్యాచ్‌లను భారత్' లో కాకుండా శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని ఐసీసీకి అధికారికంగా లేఖ రాసినట్లు బంగ్లా బోర్డు తెలిపినట్లు కథనాలు వెలువడ్డాయి. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రికార్డు ధర రూ.9.2 కోట్లకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ దక్కించుకుంది. రెహమాన్ 2016లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 60 మ్యాచ్‌లడి 65 వికెట్లు తీశాడు. కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై గురువారం బీసీసీఐ వర్గాలు స్పందించినట్లు వార్తలు వచ్చాయి.