వర్షం కారణంగా రద్దైన జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్
సూపర్-8కి అర్హత సాధించిన జింబాబ్వే
టీ0 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియాకు వర్షం పెద్ద దెబ్బ కొట్టింది. కంటిన్యూగా వర్షం పడుతున్నందున జింబాబ్వే- ఐర్లాండ్ మ్యాచ్ టాస్ లేకుండానే రద్దయింది. దీంతో జింబాబ్వేకు రెండు పాయింట్స్ లభించాయి. ఈ పాయింట్లతో ఆ జట్టు సూపర్ 8కి అర్హత సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా ప్రపంచ కప్ 2026 నుంచి లీగ్ దశలోనే అవుట్ అయ్యింది. 320 ప్రపంచ కప్ 2009 తర్వాత ఆస్ట్రేలియా జట్టు లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి వెళ్లిపోవడం ఇదే మొదటిసారి. జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్‌ను కీలకమైందిగా ఆస్ట్రేలియా భావించింది. కానీ వర్షం వారి ఆశలను అంచనాలు తలకిందులు చేసింది. వల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. తెల్లవారుజాము నుంచి పల్లెకెలెలో కంటిన్యూగా వర్షం పడుతోంది. మ్యాచ్ సమయంలో కూడా కుండపోత వాన పడుతూ ఉంది. రెండున్నర గంటల పాటు వేచి ఉన్నా సరే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఐర్లాండ్ మ్యాచ్ జరిగి జింబాబ్వే ఓడిపోయి ఉంటే, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరుకునే ఆశలు సజీవంగా ఉండేవి. ఈరోజు ఐర్లాండ్ విజయంపై కంగారూలు ఆశలు పెట్టుకున్నారు. అయితే, వర్షం వారి ఆశలను పూర్తిగా దెబ్బతీసింది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు జింబాబ్వే అద్భుతంగా రాణించింది. సికందర్ రజా నేతృత్వంలోని జట్టు ఆస్ట్రేలియాను ఓడించి షాక్ ఇచ్చింది. దీంతో ప్రపంచ కప్ అతిపెద్ద ఓటమిని ఆసిస్ ఎదుర్కొంది. జింబాబ్వే చేతిలో ఓడిపోయిన తర్వాత, సోమవారం కంగారూలు శ్రీలంక చేతిలో కూడా ఓడిపోయారు. ఇప్పుడు, ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. జింబాబ్వే టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ 8 దశకు చేరుకోవడం ఇదే తొలిసారి. 2024లో ప్రపంచ కప్ ఫార్మాట్ మార్చిన తర్వాత, జింబాబ్వే గ్రూప్ దశను దాటడం ఇదే తొలిసారి. అయితే, టీ20 ప్రపంచ కప్ జింబాబ్వే గ్రూప్ దశను దాటి ముందుకు సాగడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో వారు చివరి 12 స్థానాలకు చేరుకున్నారు, కానీ ఫార్మాట్ మార్పు తర్వాత వారికి ఇదే తొలి సూపర్ 8. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఒకే ఒక్క విజయం సాధించింది. జింబాబ్వే తమ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఐర్లాండ్ జింబాబ్వేపై ఏదో ఒక విధంగా గెలవాలని ఆస్ట్రేలియా ఆశించింది. ఆస్ట్రేలియా సూపర్ 8 ఆశలను సజీవంగా ఉంచుతుంది భావించింది. అయితే, మ్యాచ్ డ్రాగా ముగియడంతో, జింబాబ్వే మొత్తం పాయింట్లు ఐదుకి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో మిగిలిపోయింది. ఫలితంగా, ప్రపంచ కప్2026లో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటిబాటపట్టింది. గతంలో, 2009 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా గ్రూప్ దశ దాటి ముందుకు సాగలేకపోయింది. జింబాబ్వే తొలిసారిగా ప్రపంచ కప్‌లో సూపర్ 8 దశకు చేరుకుంది. గతంలో, జింబాబ్వే ప్రపంచ కప్ 2022 లో సూపర్ 12 దశకు చేరుకుంది. ప్రపంచ కప్ 2026లో సూపర్ 8 దశకు అర్హత సాధించిన ఏడో జట్టు జింబాబ్వే. ఇప్పటికే టీమిండియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ సూపర్ 8 దశకు చేరుకున్నాయి. ఇప్పుడు, పాకిస్తాన్, యూఎస్ఏ ఫైనల్ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్ లో ఓడిపోతే, అది కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది.