ఆవు కథలు చెప్పి తప్పించుకోరాదు
ప్రతిరోజూ అటెండెన్స్ ఉండాల్సిందే
ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచన
అమరావతి : వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. సమస్యలను చర్చించి సిద్ధంగా ఉండాలన్నారు.సబ్జక్ట్‌పై ప్రిపేర్ రావాలని అన్నారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 నెలలుగా కూటమి నేతల ఐక్యత కొనసాగుతోం సాగుతం దని చెప్పారు. కింది స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉ ండాలన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడతా. 40 మందిని వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడతా. ఆవు కథలు చెప్పడం మాని న్జబెక్ట్ ప్రిపేర్ అయి సభకు రావాలి.ఎవరేం మాట్లాడు తున్నారో నేనూ నోట్ చేసుకుంటా అని అన్నారు. అసెంబ్లీ జరుగుతు న్నప్పుడు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఉండాలి. నేను కూడా రోజూ ఉదయం 11 గంటల నుంచి సెషన్ అయ్యే వరకూ అసెంబ్లీలో ఉంటా. సభలో మాట్లాడేది 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అని గుర్తుపెట్టుకోవా లని చంద్రబాబు అన్నారు. అక్కడ ఏం మాట్లాడినా వారి కోసమేనని గ్రహించాలి. అనుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంతో ప్రజలకు జరుగుతున్న లబ్దిని ఎప్పటికప్పుడు చెప్పాలి. రూ. లక్ష కోట్లకు పైగా హైవే పనులు, రూ.90 వేల కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికం లో విశాఖ స్టీల్-లాంట్ రూ.450 కోట్ల నష్టంలో ఉ ంది. నష్టాలను అధిగమించి రూ.54 కోట్ల లాభాల్లోకి రావడం శుభపరిణామం. కేంద్ర ప్రాయో జికత కార్యక్ర మాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలి. అన్ని మతాలను గౌర వించాలి.. భక్తుల సెంటిమెంట్‌ను దెబ్బతీయ కూడదు. జగన్‌కు మతాలపై గౌరవం లేనం దునే వైకాపా హయాం లో రామతీర్థం సహా అనేక ఆలయా లపై దాడులు జరిగాయి. తిరుమల లడ్డుతో పా టు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారు' అని చంద్రబాబు అన్నారు.