కుటుంబంతో కలిసి ప్రధానిని ఆహ్వానించిన సచిన్
రాష్ట్రపతి, రాహుల్, అమిత్ షాలకు కూడా ఆహ్వానం
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లికి కుటుంబంతో కలసి ప్రధానిని కలసి ఆహ్వానం అందించారు. తన స్నేహితురాలు సానియా చందోక్‌ను అతడు వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 5న ముంబైలో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో సచిన్ తన కుటుంబంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. అర్జున్ టెండూల్కర్- సానియా చందోక్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సచిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహులు కూడా కలసి ఆహ్వానాలను అందచేశారు. ఈ భేటీలో అర్జున్‌తో పాటు సచిన్ భార్య అంజలి, కుమార్తె సారా కూడా పాల్గొన్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి మాయ్ మనవరాలే సానియా. ఆమె కూడా వ్యాపారవేత్త. ముంబైలో మిస్టర్ పాస్ పెట్ స్పా సంస్థను నడుపుతోంది. చాలా ఏళ్ల నుంచి నచిన్ కుమార్తె సారాతో సానియాకు అనుబంధం ఉ ౦ది. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్న అర్జున్ టెండూల్కర్ ఇటీవల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ ద్వారా మారిన సంగతి తెలిసిందే. గోవా తరఫున ఆడుతున్న అర్జున్ ఫాస్ట్ బౌలర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. 2022లో రంజీ ట్రోఫీలో గోవా తరఫున అరంగేట్రంలోనే శతకం బాదడం విశేషం. తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన తన తండ్రి సచిన్ ఘనతను అర్జున్ తిరిగరాశాడు.