కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
అమాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్
తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని
గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక
మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం
నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
దేశ రాజధాని ఢిల్లీలో మరో 'నిర్భయ' తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమ వారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురు-స్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెకార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధు వుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉ ండటంతో... ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉ ండిపో యింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది.. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయలేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్ ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలో ఉన్న రింగురోడ్డు వద్ద బాలికను వదిలేసి వెళ్లిపోయారు. జరిగిన దారుణం నుంచి తేరుకొని బాలిక.. ఓ ఆటోలో సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, అదే రోజు రాత్రి డ్రైవర్ కులాప్, కండక్టర్ సందీప్‌ను అరెస్టు చేశారు.