కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా అనగానే 'టాక్సిక్'పై దేశవ్యాప్తంగా అంచనాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్టే ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. భారీ తారాగాణంతో, హాలీవుడ్ స్థాయి అత్యున్నత సాంకేతిక విలువలతో, ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో బుధవారం 'టాక్సిక్' విడుదలైంది. గంగా (నయనతార), రాయ(యష్) అక్కాతమ్ముళ్లు, చిన్నతనంలోనే అమ్మానాన్న దూరం కావడంతో రాయను గంగీ అమ్మగా మారింది. తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ తమ్ముడ్ని పెంచి పెద్ద చేసింది. చిన్నతనం నుంచీ నేర ప్రపంచంలోనే పెరిగి పెద్ద కావడంతో ఇద్దరూ నేరప్రవృత్తితోనే ఎదుగుతారు. గోవా నేరసామ్రాజ్యానికి తన తమ్ముడ్ని అధివతిగా చూడాలనుకుంటుంది గంగ. అందుకోసం అప్పటికే గోవాను ఏలుతున్న ఓ మాఫియా డాన్ చేతులు కలుపుతుంది. ఆ గ్యాంగ్‌లో రాయ కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. మాఫియా డాన్ కూతురు రెబెక్కా(తార సుతారియా) రాయకు చేరువవుతుంది. ఇద్దరూ ఒకటవుతారు. మ-రోవైపు ప్రత్యర్థుల దాడులు, ప్రతిదాడులతో కథ సాగుతూ ఉ ంటుంది. ఇంతలో రాయకు రాయల్ నర్కస్లో పనిచేసే నాడియా(కియారా అద్వానీ) పరిచయం అవుతుంది. మానసికంగా శారీరకంగా కూడా ఇద్దరూ ఒకటవుతారు. ఈ క్రమంలో నాడియా గర్భవతి అవుతుంది. తన కూతురుని కాదని వేరొక అమ్మాయితో రాయా తిరుగుతున్నాడని తెలిసి మాఫియా డాన్ మండిపడతాడు. ఈ క్రమంలో జరిగిన కలామటీలో ఆ మాఫియా డాన్ రాయ్ చేతులో హతుడవుతాడు. అసుకోని పరిస్థితుల్లో కత్రువుల చేతుల్లో రాయా అక్క గంగ, రాయా ప్రేయసి నాడియా చిక్కుకుంటారు. కదువులో ఉన్న బిడ్డను చంపుతామని బెదిరించి, నాడియా చేతులతోనే గంగను దండగులు చంపిస్తారు. అక్క చావుకు కారణమైన ప్రియురాలిని రాయ క్షమించాడా? శిక్షించాడా? నాడియా జీవితం ఎలాంటి మలుపు తీసుకున్నది? అక్క కోరిక ప్రకారం రాయా గోవా మాఫియా సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. కేజీఎఫ్'లో ఎలాగైతే నేర ప్రపంచంలో పెరిగి, డౌన్‌గా ఎదుగుతాడో.. ఇందులోనూ దాదాపుగా అంతే. అదే ధోరణిలో కథ సాగింది. అందులో అమ్మ సెంటిమెంట్. ఇందులో అక్క సెంటిమెంట్, తప్పు చేసిన ఓ తండ్రి మానసిక వేదనే ఈ సినిమా కథ అని చెప్పాచ్చు. సినిమా ప్రథమార్ధం సాధారణ మాఫియా సినిమాలా అనిపించినా, ద్వితీయార్ధం మాత్రం కథ కొత్త మలుపు తీసుకుంటుంది. ఆ మలువుకు సంబంధించిన సంఘర్షణ ఆడియన్ కి కొత్తగా అనిపిస్తుంది. ఏదేమైనా అసలు కథ కంటే యాక్షన్ అంశాలకే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఆద్యంతం నరుక్కోవడాలు, చంవుకోవడాలు, కాల్చుకోవడాలు, మధ్య మధ్య ఇంటిమేటెడ్ సీన్స్. కుటుంబ ప్రేక్షకులకు కలిసి చూసేలా అయితే సినిమా లేదు. యశ్ ఇందులో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. యశ్ అక్క గంగగా నయనతార కథలో ప్రాధాన్యత గల పాత్రను పోషించింది. ఇందులో ఆమె యాక్షన్ సీక్వెన్స్ కూడా అదరగొట్టింది. ఇక కియారా అద్వానీ భావోద్వేగపూరితమైన పాత్ర పోషించింది. చక్కగా అభినయించింది. తారా సుతారియా, రుక్మిణీ వసంత్ పాత్రలు గ్లామర్ కే పరిమితం అయ్యాయి. చెప్పుకోదగ్గ కథ కాదు. మేకింగ్ మాత్రం బావుంది. గీతూ మోహన్ దాస్ స్క్రీన్‌ప్లేను అర్థం చేసుకోవడం సగటు ప్రేక్షకుడికి కష్టమే. మొత్తం కథ, కథనం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బావుండేది, నిర్మాతలు డబ్బులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టారు. ఖర్చుపెట్టిన ప్రతి పైసా తెరపై కనిపించింది. ఇక రవి బసూర్ నేపథ్య సంగీతం బావుంది. కెమెరా వర్క్ కూడా బావుంది. మొత్తంగా సాంకేతికంగా సినిమా బావుంది.