ఆంధ్ర ప్రదేశ్ ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా , నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పరికరాల ఏర్పాటు కార్యక్రమం శనివారం ప్రారంభమైందని తెలిపారు.
ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తామ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నామని ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.
అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్ర ప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. 'గ్రీన్ అమ్మోనియా.. భవిష్యత్తులో పెను మార్పునకు నాంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారు. 2014లోనే మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికింది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ప్లాంట్ కు సీఎం గ్రీన్ అమ్మోనియా ఓ మైలురాయి అన్న పవన్ కళ్యాణ్ అమ్మోనియాకు నాంది పలికాం అని అన్నారు. కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ. 2027 జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ మన రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ కానుందని చంద్రబాబు అననారు. బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. కాలుష్యం వల్ల సముద్రంలోనూ పెను మార్పులు వస్తున్నాయి. ఆంధప్రదేశ్‌కు వెయ్యి కి.మీ సముద్ర తీరం ఉంది. 20 పోర్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రపంచంలో ఎండ పుష్కలంగా ఉండేది మనదేశంలోనే. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్.. మన రాష్ట్రానికి వరం అని అన్నారు. మన సంస్కృతిని కాపాడుకుంటూనే టెక్నాలజీని వాడుకోవాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా స్వగ్రామాన్ని మర్చిపోకూడదు. ఆలోచనలు ఆచరణలో పెట్టేవారు చాలా కొద్ది మందే ఉంటారు. వారిలో చలమలశెట్టి అనిల్ ఒకరు. చరిత్రను తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నందుకు గర్వంగా ఉంది. ఆనాడు ఎన్టీఆర్ చొరవతో కాకినాడకు నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ వచ్చింది. కాకినాడ గురించి భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటారు. ఇలాంటి పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులన్నీ ఇక్కడ ఉ న్నాయి. ప్రజలకు మేలు జరిగే ఆలోచనలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేస్తోంది. 2047 నాటికి మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారవుతుందని అన్నారు. గ్రీన్ అమ్మోనియా వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రకృతి సేద్యం పెరగడమే అందరి ఆరోగ్యాలకు శ్రీరామ రక్ష. ఎరువులు, పురుగుమందుల వినియోగం బాగా తగ్గించాలి. గ్రీన్ అమ్మోనియాను ఏ దేశానికైనా ఎగుమతి చేసే అవకాశం ఉందని సీఎం అన్నారు. బలమైన సంకల్పం ఉంటేనే ఏదైనా సాధించగలమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తాను పుట్టి పెరిగిన కాకినాడకి అనిల్ ఎంతో చేస్తున్నారని అభినందించారు. అనేక కష్టాలను తట్టుకుని ఏఎమ్ గ్రీన్ కంపెనీ పెట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించు కుంటూ ముందుకెళ్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ దిశగా మనం వేసే అడుగులు చాలా కీలకం. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం అన వివరించారు. కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయి. రాష్ట్ర సుస్థిరాభివృద్ధిలో ఇది గేమ్ ఛేంజర్ కానుంది. ఈ ప్రాజెక్టు వల్ల వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారని అన్నారు. గత ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తల ఇబ్బందులు తెలుసు. పార్టీలు మారవచ్చు.. కానీ, ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం అని పవన్ అన్నారు.