పరిశ్రమలు తేవడం మా బాధ్యత..
కష్టపడటం యువత బాధ్యత
టాటా రెన్యూవబుల్ ఎనర్జీ
శంకుస్థాపన సభలో మంత్రి లోకేష్
టాటా-సుజ్లాన్ 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శ్రీకారం
రూ.5,350 కోట్ల పెట్టుబడితో రాయలసీమలో మెగా ప్రాజెక్టు
4 వేల ఉద్యోగాలు.. యువతకు ఉపాధి అవకాశాలు
ఏపీని దేశంలోనే కాకుండా ప్రపంచ పెట్టు బడిదారుల తొలి గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పత్తికొండ మండలం హోనూరు సమీపంలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, సుజ్ఞాన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం లోకేష్ శంకుస్థావనచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకుని, గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపికగా మారిందన్నారు. టాటాపవర్ రెన్యూవబుల్ఎనర్జీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పత్తికొండలో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల విండ్ సనర్ ప్రాజెక్టు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. మొత్తం రూ.5,350 కోట్ల పెట్టుబడితో అమలు కాను కానున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో సుమారు 14 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,100కుపైగా రైతు కుటుంబాలకు మూడు దశాబ్దాల పాటు స్థిరమైన కౌలు ఆదాయం లభిస్తుందన్నారు. ఏపీపై పెట్టుబడిదారుల విశ్వాసం 2024లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. గత ఐదేళ్లలో ఒక్క ప్రధాన రెన్యూవబుల్ ఎనర్జీ నర్జీ ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతిందన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ ఫండ్స్ రాష్ట్రాన్ని బ్లాగ్లిస్ట్లో పెట్టాయని, ఏడాది కాలంలో విశ్వసనీయ పరిపాలనతో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చగలిగామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సామర్థం 400 శాతం పెరిగిందని మంత్రి వెల్లడించారు. ఇది ప్రభుర్వం కల్పించించిన విశ్వాసానికి నిదర్శనమన్నారు.
160 గిగావాట్లు లక్ష్యం
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ద్వారా రాష్ట్రంలో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సోలార్ మాడ్యూల్స్, సెల్స్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీస్ అమ్మోనియా, ట్రాన్స్ మిషన్ నెట్వర్క్ స్టోరేజ్ వ్యవస్థలు, పోర్టులు, తయారీ పరిశ్రమల వరకు మొత్తం క్లీన్ ఎనర్జీ సరఫరా గొలుసును ఆంధ్రప్రదేశ్లోనే "అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ దిగ్గజాల చూపు ఏపీపై: ప్రస్తుతం బ్రూక్ఫోల్డ్, బ్లాక్డోన్, బ్లాక్జాక్ వంటి ప్రపంచ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. అలాగే టాటాపవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, వారి వంటి 3 దేశీయ దిగ్గజ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని వెల్లడించారు.
క్లీన్ ఎనర్జీ ఎగుమతులు
భారతదేశంలోనే అత్యంత పాడవైన తీరప్రాంతం, ప్రపంచ స్థాయి ఓడరేవులు, సమృద్ధిగా లభించే పునరుత్పాదక వనరులతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఎగుమతులకు దేశానికి ముఖద్వారంగా మారే అవకాశముందని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో ఉ త్పత్తయ్యే స్వచ్చ ఇంధనం యూరప్, జపాన్, కొరియా తదితర దేశాలకు ఎగుమతి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఐటీ తిరుపతి, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్నో టాటా పవర్ భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. సోలార్, వునరుత్పాదక ఇంధన సాంకేతికతలపై పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా మారుతుందని తెలిపారు.
సుజ్ఞాన్ కి అభినందనలు
పవన విద్యుత్ రంగంలో అగ్రగామిగా ఉన్న సుజ్ఞాన్ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అనంతపురంలోనే విండ్ టర్బైన్ల తయారీ జరగడం వల్ల స్థానిక పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నందుక నసంస్థకు అభినందనలు తెలిపారు. కర్నూలుపై ప్రత్యేక దృష్టి ఉమ్మడి కర్నూలు జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మంత్రి చెప్పారు, యువగళం పాదయాత్రలో 45 రోజుల పాటు 14 నియోజకవర్గాల్లో పర్యటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నార. బాధ్య యువతకు పిలుపులు తీసుకురావడం ప్రభుత్వ డికి తగిన నైపుణ్యంతో సిద్ధమవడం న్యత, వాటికి యువత బాధ్యతని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఐటీఐలను పరిశ్రమలకు అనుసంధానం చేస్తున్నామని, ప్రతి ఐటీఐని ఒక పరిశ్రమకు అనుసంధానించి అవసరమైన నైపుణ్యాల ప్రకారం శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇటీవల ప్రారంభించిన లెర్న్- ఎర్న్ - గ్రాడ్యుయేట్ విధానంలో నడిచే విశ్వవిద్యాలయం ద్వారా మూడు నెలలు తరగతి గదిలో, ఎనిమిది నెలలు పరిశ్రమల్లో శిక్షణ పొంది చదువుకుంటూనే సంపాదించే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో టాటా పవర్ సీఈఓ ఎండీ ప్రవీర్ సిన్హా, టాటా పనర్ రెన్యూవబుల్ ఎనర్జీ సీఈఓ, ఎండీ సంజయ్ బంగా, సుజ్లాస్ వైస్ చైర్మన్ గిరీష్ తంతి, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.