ఇటీవల పలు కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన యాక్ట్రెన్ అనసూయ.. ఇప్పుడు కృష్ణుడి సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే వీడియోలో ఆమె డ్యాన్స్ ఎంతగా ఆకట్టుకుందో... చివర్లో పెట్టిన క్యాప్షన్ అంతకంటే ఎక్కువ చర్చకు దారితీస్తోంది. దీంతో సనాతన ధర్మంపై ఇటీవల తనపై వచ్చిన విమర్శలకు అనసూయ ఇలా ఫుల్ స్టాప్ పెట్టారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అనసూయ రాధా గెటప్ లో కనిపించారు. ఎరుపు రంగు చీరలో, స్పెషల్ మేకప్ తో ఆమె చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. ఇన్ స్ట్రాగ్రామ్ లో వైరల్ గా మారిన 'తులసి కోమలవేణి.. అనే కన్నడ సాంగ్ కు ఆమె డ్యాన్స్ చేశారు. పాటకు తగ్గట్టుగా చేసిన ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ మూవ్మెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా విలిచాయి. అయితే ఆ వీడియోకు అనసూయ ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు అసలు చర్చకు కారణమైంది. 'కృష్ణుడికి అంతా తెలుసు. నాకు అది చాలు' అంటూ ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. శాంతం, విగ్రహం, తపస్సు, పవిత్రత, సహనం, సరళత, జ్ఞానం, సాక్షాత్కారం, విశ్వాసం, బ్రహ్మచర్యం వంటి పదాలను కూడా ప్రస్తావించారు. దీంతో తనపై జరుగుతున్న చర్చకు డైరెక్ట్ గా రెస్పాండ్ అవ్వకుండా... తన నమ్మకాన్ని ఇలా చెప్పారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనసూయకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత నటీగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రంగస్థలం, 'పుష్ప' వంటి సినిమాలతో పటిగా తప స్థాయిని పెంచుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకునే ఆమె.. కొన్ని సందర్భాల్లో చేసే వ్యాఖ్యల కారణంగా విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ఇటీవల హిందూ ధర్మం, దేవుడి పేరును ఉపయోగించుకోవడం వంటి అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆమెను తీవ్రంగా విమర్శించగా.. అనసూయ కూడా తనదైన శైలిలో స్పందించారు. దీంతో ఆ అంశం కొంతకాలం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సమయంలోనే కృష్ణుడి సాంగ్ కు రాధగా అనసూయ చేసిన డ్యాన్స్ రావడం ఆసక్తిని పెంచింది.