భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ పై చర్చిస్తారు
కంప్యూటింగ్ పరకరాలకు క్వాంటం ఎకోసిస్టమ్ కు రూపకల్పన
డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా దృష్టి
స్పేస్, డ్రోన్, ఎలక్ట్రాన్రిక్స్, మెడ్క్ పార్క్ లాంటి పారిశ్రామిక క్లస్టర్లు ఏఐ ఇంపాక్ట్
సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు నాయుడు
పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడే రోజు సమీప భవిష్యత్‌లో వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేసేలా క్వాంటం ఎకోసిస్టమ్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రాన్రిక్స్, మెడిటెక్ పార్థాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని వివరించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రపంచ క్వాంటమ్ ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెన్స్టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉ న్నాయని పేర్కొన్నారు. ఈ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు.. క్వాంటం ఎకో సిస్టంను తీర్చిదిద్దుతున్నామని వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న కృత్రిమ మేథస్సు ద్వారా పోటీతత్వం అంశంపై జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు సీఎం చంద్రబాబు హాజరై.. తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి పాల్గొన్నారు. సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుందని చెప్పుకొచ్చారు. గూగుల్ లాంటి సంస్థల రాకతో ఏపీలోని విశాఖపట్నం ఏఐ డేటా హబ్ మారుతుందని తెలిపారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేసేలా క్వాంటం ఎకో సిస్టం రూపకల్పన చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని.. దేశం దాన్ని సాధించి తీరుతుందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందనే విశ్వాసం తమకు ఉందని చెప్పుకొచ్చారు. పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐని వినియోగించేందుకు ప్రభుత్వ వరంగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. డీపీ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎపీలో క్వాంటమ్ ఏఐ రంగాల్లో నైపుణ్యాభి వృద్ధి, మౌళిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా ఏడు ఒప్పందాలు కుదర్చుకుంది సర్కార్. ఏపీని క్వాంటమ్ ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం... అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ క్వాంటమ్ రంగాల్లో శిక్షణ, ప్రభుత్వ శాఖల్లో ఏఐ క్వాంటమ్ వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. క్వాంటమ్, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటమ్ ఎక్స్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ. ఏఐ- క్వాంటమ్ డిజిటల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్న తీర్చిదిద్దేలా ప్రణాళికలు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం కార్యక్రమానికి యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్ సహా ఆ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.
నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీగా ఏపీ
టెక్ దిగ్గజాలతో చంద్రబాబు విస్తృత చర్చలు
నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు
ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో అడోబ్, ఆరామ్ కో, ఎన్విడియా వంటి దిగ్గజాలతో సీఎం భేటీ
ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కీలక చర్చలు జరిపారు. టెక్ నైపుణ్యాలున్న యువశక్తే రాష్ట్రానికి అతిపెద్ద వనరని, వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ వంటి భవిష్యత్ రంగాల్లో ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇండియా ఏఐ-ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో భాగంగా పలు అంతర్జాతీయ టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలతో ఆయన వేర్వేరుగా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్చలు జరిపారు.
టెక్ దిగ్గజాలతో కీలక సమావేశాలు
ఏపీ పెవిలియన్ లో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్క ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకైర్, లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, బోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ బోస్లా వంటి ప్రముఖులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ తో భేటీ సందర్భంగా, ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు వివరించారు. క్రియేటర్ ఎకానమీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి సహకారం అందించాలని కోరారు. ఇందుకు స్పందించిన శంతను నారాయణ్, విద్యార్ధులు, నివుణులకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేకంగా క్రియేటర్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు, పౌరసేవల డిజిటలైజేషన్ వంటి అంశాలపై కూడా ఇరువురి మధ్య ఫలప్రదమైన చర్చ జరిగింది.
ప్రపంచ ఇంధన దిగ్గజం సౌదీ ఆరామ్క ప్రతినిధులతో ముఖ్యమంత్రి జరిపిన చర్చల్లో ఏపీలో సౌర విద్యుత్ సహా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు రాష్ట్రం అత్యంత అనువైన ప్రాంతమని, ఇక్కడ కార్యకలాపాలు విస్తరించాలని ఆరామ్కను ఆహ్వానించారు.
ఏఐ స్టాళ్లను సందర్శించిన సీఎం
సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఏఐ సమ్మిట్‌లోని వివిధ స్టాళ్లను సందర్శించారు. ఎన్విడియా, టాటా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయం, వైద్యం, పరిశ్రమల్లో ఏఐ వినియోగం ద్వారా వస్తున్న ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టాటా సంస్థ ఏపీలో అమలు చేస్తున్న 'సంజీవని' (డిజిటల్ హెల్త్ రికార్డులు), డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రదర్శించింది. రోబోటిక్స్, ఏఐ ఆధారిత సేవల గురించి సీఎం ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ, నాలెడ్జ్ ఎకానమీలో అగ్రగామిగా నిలపాలన్న తన దార్శనికతను చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.