గత ప్రభుత్వం పరిశ్రమలు రాకుండా అడ్డుకుంది.
స్థానిక ఎన్నికల్లోనూ కూటమిదే విజయం.
ఓటమి భయంతోనే గొడ్డలి పార్టీ ఏకగ్రీవాలు వద్దంటోంది.
నర్సాపురం పేదల సేవలో ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సమ ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 31 ఏళ్ల క్రితం సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశానని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రజా చైతన్యం, ప్రజా భాగస్వామ్యం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వార్డు సభ్యులు, సర్పంచులు కూడా పాలనలో భాగం కావాలన్నారు. అప్పుడే కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధికి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం అన్నారు. ఓటమి భయంతోనే ఏకగ్రీవాలను వద్దని గొడ్డలి పార్టీ నేతలు చెబుతున్నారని అన్నారు. ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహించాయని. మున్సిపాలిటీలు, ఆయారాం- గయారాం అనే పరిస్థితి లేకుండా కార్పోరేషన్లలో చైర్మన్, మేయర్ల ఎన్నికను ప్రత్యక్షం చేశామని అన్నారు. గొడ్డలి పార్టీ నేతలు రిజర్వేషన్లను కూడా తగ్గించేశారని సీఎం ఆక్షేపించారు. రాష్ట్రంలో స్థాని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరక్కుండా అడ్డుకోవటమే గొడ్డలి పార్టీ ఆలోచన అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని సీఎం స్పష్టం చేశారు. గత పాలకులు పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని సీఎం విమర్శించారు. దీనివల్ల యువత భవిష్యత్తు దెబ్బతిందన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థలను సమర్థంగా నిర్వహిస్తూ తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించామని తెలిపారు. ఆక్వా రైతుకు అందగా నిలిచేందుకు విద్యుత్ యూనిట్ ను రూ.1.5 కే అందిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ మార్కెట్లలో ఇతర దేశాలతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులను తీర్చిదిద్దాలని అన్నారు. ప్రజా పాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐ ట్యూటర్, ఏఐ డాక్టర్ వంటి వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు ఆన్లైన్లో ప్రభుత్వ సేవలు అందించేలా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుపైనా దృష్టి పెట్టామని తెలిపారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆక్వా కల్చర్ యూనివర్సిటీ, దంప్ యార్డు, డెల్టా మోదర్నైజేషన్ వంటి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. వమహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. గత ఏడాది లక్ష మంది ద్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఈలుగా ఎదిగారని, ఈసారి లక్ష్యాన్ని మరింత పెంచామని తెలిపారు. ద్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు స్వయం బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల్లో ఇంకా ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఉందని సీఎం పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ ఉ తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పసభాపతి రఘురామ కృష్ణం రాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, విప్ బొలిశెట్టి శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.