ప్రపంచ క్రికెట్లో టీ20 వరల్డ్ కప్ అంటేనే ఒక హైవోల్టేజ్ ఎమోషన్. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమ్ ఇండియా బరిలోకి దిగుతుంటే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. రోహిత్, విరాట్, జడేజా వంటి దిగ్గజాలు తప్పుకున్నాక టీన్ఇండియా ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో, గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో కుర్రాళ్లు దుమ్ములేపుతున్నారు. అయితే ఈసారి జరగబోయే 2026 మెగా టోర్నీలో కొందరు ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటివరకు వరల్డ్ కప్ ఆడని ఆ ఐదుగురు యంగ్ గన్స్? పైనే అందరి ఫోకస్ పడింది. వీరంతా ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే తమ మార్కును చాటారు. ఇప్పుడు అతిపెద్ద వేదికపై తమ సత్తా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పంజాబ్ నుంచి వచ్చిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రస్తుతం టీన్ఇండియాలో ఒక సెన్సేషన్. ఐసీసీ టీ20లో అతడిదే మొదటి ర్యాంక్. జింబాబ్వేపై సెంచరీ కొట్టినప్పటి నుంచి అభిషేక్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లో 1115 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ముఖ్యంగా 188పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియాకు మెరుపు ఆరంభాలు ఇవ్వడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించనున్నాడు. అమృత్సర్ నుంచి వచ్చిన ఈ కుర్రాడు ఓపెనర్ గా బరిలోకి దిగి భారీ స్కోర్లు సాధిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వరల్డ్ కప్ వేదికపై ఈ యువ కెరటం ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా జట్టులో ఉన్నా వాషింగ్టన్ సుందర్ కు ఇది మొదటి టీ20 వరల్డ్ కప్ కావడం విశేషం. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం పవర్లో బౌలింగ్ చేయడమే కాదు, అవసరమైనప్పుడు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలోనూ దిట్ట. 58 మ్యాచ్ ల్లో 51 వికెట్లు తీసి ఎకానమీని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నప్పుడు సుందర్ తో వారిని కట్టడి చేస్తున్నారు. బ్యాటింగ్‌లో కూడా మునువటి కంటే చాలా మెరుగయ్యాడు. లోయర్ ఆర్డర్లో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంలో సుందర్ కీలకం కానున్నాడు. ఈ 26 ఏళ్ల ఆల్ రౌండర్ తన అనుభవంతో ఇండియాకు రెండోసారి కప్పు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కీలక మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఇతనికి ఈ మెగా టోర్నీలో కలిసి వస్తుంది. రింకూ సింగ్ పేరు వింటేనే స్టేడియంలో అరుపులు వినిపిస్తాయి. గత వరల్డ్ కప్ లో స్టాండ్‌బై ప్లేయర్‌గా వెళ్లిన రింకూ ఈసారి ఏకంగా మెయిన్ స్క్వాడ్‌లో చోటు సంపాదించాడు. 35 టీ20ల్లో 42 సగటుతో 550 పరుగులు చేయడం అంటే అది రింకూకే సాధ్యం. దాదాపు 162 స్ట్రైక్ రేట్‌తో చివర్లో వచ్చి మ్యాచ్‌లను ఫినిష్ చేయడంలో ఇతను మొనగాడు. అయితే జట్టులో ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో తుది జట్టులో అవకాశం రావడం కొంచెం కష్టమే అనిపిస్తోంది. కానీ గంభీర్, సూర్యకుమార్ ఈ 'లిటిల్ మాస్టర్' పై నమ్మకం ఉ ంచారు. ఒత్తిడిలో కూడా కూల్‌గా బ్యాటింగ్ చేసి సిక్సర్ల వర్షం కురిపించే రింకూ, ఇండియాకు మరో వరల్డ్ కప్ తెస్తాడనే నమ్మకం అందరిలో ఉంది. ఉ త్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఈ కుర్రాడు తన హార్డ్ వర్క్ తో ఈ స్థాయికి చేరుకున్నాడు. టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రింకూ ఇచ్చే ఫినిషింగ్ టచ్ టీమ్ఐండి యాకు వెన్నెముకగా మారుతుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన హర్షిత్ రాణా ఇప్పుడు వరల్డ్ కప్ స్టేజీపై మెరవబోతున్నాడు. గంభీర్ కోచింగ్‌లో రాటుదేలిన ఈ 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ ల్లో ఏడు వికెట్లు తీసినా, ఎకానమీ విషయంలో కొంచెం మెరుగుపడాల్సి ఉంది. కానీ డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడం, అవసరమైతే బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించడం ఇతని ప్రత్యేకత. బుమ్రా, అర్ష్ప్ సింగ్ వంటి సీనియర్ల నీడలో హర్షిత్ మరిన్ని మెలకువలు నేర్చుకుం టున్నా డు. ఆరంభంలో కొంచెం వివాదాలు ఎదుర్కొ న్నా, తన బౌలింగ్ తోనే అందరి నోళ్లు మూయించాలని చూస్తున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఈ లిస్టులో ఉండడం మరో హైలెట్. ఇటీవల వృషణాల సమస్య వల్ల సర్జరీ చేయించుకున్నా, వరల్డ్ కప్ నాటికి కోలు కుంటాడని అందరూ నమ్ముతున్నారు. సౌత్ ఆఫ్రికా గడ్డపై బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టి తనలో ఎంత టాలెంట్ ఉందో ప్రపంచానికి చాటిచెప్పాడు. గతేడాది పాకిస్థాన్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్లో తిలక్ ఒక నమ్మదగ్గ బ్యాటర్‌గా ఎదిగాడు. టెక్నిక్ పరంగానూ, మానసికంగానూ చాలా బలంగా ఉండే తిలక్, ఒత్తిడిలో కూడా పరుగులు రాబట్టగలడు. 20 జట్ల టోర్నమెంట్లో ఇండియాను గెలిపించడానికి తిలక్ వర్మ బ్యాట్ ఝులిపించడం చాలా అవసరం.