స్వదేశీ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేద్దాం
నాణ్యమైన ఉత్పత్తుల కోసం భారత్ వైపు ప్రపంచం చూపు
మన వస్తువులు గ్లోబల్ మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయి
ఏదైనా కొనేటప్పుడు భారత్‌లో తయారైందా అని అడగండి
మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: స్వదేశీ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేయా లని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రసార మైన మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్లో ప్రసంగిస్తూ చూస్తున్నా రా మిత్రులారా... ఇండియాలో తయారైన వస్తువులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతు న్నాయి. మన దేశంలో తయారైన వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు. ఇది మన స్వాభిమానం, మన స్వతంత్రత కూడా. మనం వోకల్ ఫర్ లోకల్ అని అన్నాం కదా. ఇప్పుడు అది వోకల్ ఫర్ లోకల్ నుంచి గ్లోబల్ ఫర్ లోకల్ గా మారుతోంది. మన భారతీయ ఉత్పత్తులను కొనాలని ప్రపంచం ఆశపడుతోంది.మన బ్రాండ్లు, మన స్టార్టప్‌లు, మన యువత తయారు చేస్తున్న వస్తువులు ఇప్పుడు గ్లోబల్ మార్కె ట్లో దుమ్ము రేపుతున్నాయి. కానీ ఇక్కడ ఒక మంత్రం గుర్తుంచు కోండి... నాణ్యత! నాణ్యత!! నాణ్యత!!. మన ఉత్పత్తులు లోవరహితంగా ఉండాలి. పర్యావరణంపై చెడు ప్రభావం లేకుండా ఉండాలి. ఈ రెండూ ఉంటేనే మన భారతీయ బ్రాండ్లు ప్రపంచంలో శాశ్వతంగా నిలుస్తాయి. మీరు కూడా ఇప్పటి నుంచి ఏదైనా కొనేటప్పుడు ఇది మన భారత్‌లో తయా రైందా? అని ఒక్కసారి అడగండి. ఇది చిన్న ప్రశ్నకాదు. ఇది చికసిత్ భారత్ నిర్మాణంలో మీ భాగస్వామ్యం అని అన్నారు.
జెన్ జెడ్‌లో భజన్ క్లబ్బింగ్ టెండ్
మన దేశంలో భజనలు, కీర్తనలు ఎప్పుడూ ఆత్మకు ఆహారంగా ఉండేవి. ఇప్పుడు య-వతలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. దీన్ని 'భజన్ క్లబ్బింగ్' అంటున్నారు. ఇది జెన్ జెడ్ యువతలో చాలా పాపులర్ అవుతోంది. లైట్లు, సౌండ్, ఎనర్జీల తో కాన్సర్ట్ లాంటి వాతావరణంలో భజనలు, భక్తి పాటలు మాత్రమే వినిపిస్తుం టాయి. భక్తి పట్ల గౌరవాన్ని, పవిత్రతను అలాగే ఉంచుతూ ఆధునిక రూపంలో భక్తిని అనుభవిస్తున్నారు. ఇది చూడటానికి చాలా ఆనందంగా, హృదయానికి ఆహ్లాదక రంగా ఉంది. భక్తి మార్గంలో యువత ఇలా కొత్త దారులు తీసుకుంటున్నారని తెలియడం సంతోషం కలిగిస్తోంది. ఇది భక్తి సంప్రదాయాన్ని ఆధునిక యువతకు అనుసంధానం చేసే గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు. ఆధ్యాత్మికతను తమ స్టైల్లో యువత ఆస్వాది స్తున్నారని, దీన్ని ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా గుర్తించాలని ప్రధాని అన్నారు.
3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా భారత్
2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియాను ప్రధాని గురించి గుర్తుచేశారు. ఇప్పుడు ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భారత్ ఉంది. ఏఐ. స్పేస్, సెమీకండకర్స్ వంటి సకాండక్టర్స్ రంగాల్లో భారత స్టార్టప్‌లు ముందంజలో ఉన్నాయి. వీటన్నిం టిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న యువతకు సెల్యూట్ అని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో సమాజం
పర్యావరణ పరిరక్షణ సమాజ భాగస్వామ్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్, అజమ్ గఢ్ లో తమసో నదిని ప్రజలు శుభ్రం చేసిన వైనాన్ని, ఆంధ్రప్రదేశ్, అనంతపురంలో రిజర్వా యర్లు శుభ్రం చేసి నీటి సంరక్షణ, చెట్లు నాటిన అనంత నీటి సంరక్షణ ప్రాజెక్ట్‌ను మోడీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం ప్రత్యేక లేఖ రాశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశ యువతకు ఆ లేఖలో ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఇది కేవలం ఒక రోజు మాత్రమేకాదు ఇది మన ప్రజాస్వామ్య శక్తిని గుర్తుచేసే, బలపరిచే పవిత్ర దినం. మీరు 18 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఓటరుగా మారిన క్షణం ఒక పెద్ద వేడుకలా జరుపుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పాఠశాలలు, కళాశాలలు అందరూ కలిసి ఈ క్షణాన్ని స్వీట్లు పంచుకుంటూ, ఆనం దంగా జరుపుకోవాలి. ఓటు వేయడం అంటే ప్రజాస్వా మ్యంలో అత్యున్నత హక్కు మాత్రమే కాదు, అది అతి పెద్ద బాధ్యత కూడా. దేశ భవిష్యత్తును మీ ఓటు తీర్చిదిద్దుతుంది. మీరు ఓటరుగా మారడం అంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి మీరు ప్రాణం పోసినట్లే. ప్రజాస్వామ్యానికి యువతే ఆధారం, శక్తి, భవిష్యత్తు. నారీ శక్తితో మన దేశం బలపడుతోంది. మహిళలు ఓటు వేసి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో మీరంతా భాగస్వాములు. 18 ఏళ్లు పూర్తయిన ప్రతి యువకుడు, యువతి ఓటరుగా నమోదు అయ్యేలా చూడండి. మీ చుట్టూ ఉన్నవారిని ప్రోత్సహించండి, వారిని ఓటు హక్కు గురించి అవగాహన కల్పించండి. ఈ దినోత్సవం సందర్భంగా మన ఎన్నికల సంఘానికి అభినందనలు. వారికృషి వల్లే మనప్రజా స్వామ్యం ఇంత బలంగా నిలుస్తోంది. మీరంతా ప్రజాస్వామ్య ప్రక్రియల్లో మురుకుగా పాల్గొనండి. మీఓటు ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మరింత గొప్పగా చేయండి అని మోడీ పిలుపునిచ్చారు