నేటి యువ కథానాయకుల్లో వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు నవీన్ పొలిశెట్టి. ఈ సంక్రాంతికి అలాంటి వినోదాన్ని పంచడానికి 'అనగనగా ఒకరాజుఅంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గౌరవపురం జమీందార్ గోపరాజు మనవడే రాజు (నవీన్ పొలిశెట్టి). వారసత్వంగా జమీందార్ మనవడు అనే పేరు తప్ప, తాత సంపాదించిన ఆస్తులేమీ మిగలకపోవడంతో ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ, పగటి కలలు కంటూ గడుపుతుంటాడు. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడిపోవచ్చనే నిర్ణయానికొస్తాడు. చారులత (మీనాక్షి చౌదరి)ని చూశాక ఆమె తన రాణి అయితే కష్టాలన్నీ గ్జిటెక్కేయొచ్చని భావించి, ఆమె మనసుని గెలచుకోవాలని రంగంలోకి దిగుతాడు. మరి చారులత మనసుని ఎలా గెలిచాడు? ఆమె జీవితంలోకి వచ్చాక రాజు కష్టాలు తొలగిపోయాయా? రాజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తదితర విషయాల్ని తెరపై హృద్యంగా చిత్రీకరించారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఒక వ్లలెటూరి కథ ఇది. కథ, కథనం, పాత్రలు... ఇలా ప్రతిదీ ఇదివరకటి సినిమాల్లో చూసిన అనుభూతినే కలిగిస్తాయి. అయినా సరే, రాజు పాత్ర చేసే హంగామా నవ్విస్తుంది. కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తన మార్క్ టైమింగ్ ని ప్రదర్శిస్తూ, వన్ మేన్ షోలా సినిమాని ముందుకు నడిపించాడు. సంభాషణలు ఈ సినిమాకి ప్రధానబలం. తన దగ్గరికి సాయం కోసం వచ్చే జనాల కష్టాల్ని వింటూ రాజు పడే అగచాట్లతో సినిమా ముందుకు సాగుతుంది. ఆ సన్నివేశాలన్నీ సాదాసీదాగా అనిపిస్తాయి. పెళ్లిలో శవథం, డబ్బున్న అమ్మాయిల కోసం రాజు చేసే ప్రయత్నాలు, ఆపరేషన్ చారులత ఎపిసోడ్స్ మొదలయ్యాకే అసలు సినిమా మొదలవుతుంది. భీమవరం బాల్మ, రాజుగారి పెళ్లిరో పాటలు సినిమాకి మరింత ఊపుని తీసుకొస్తాయి. ఆ రెండు పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. చారులత మననుని గెలిచేందుకు రాజు తన గ్యాంగ్‌తో కలిసి చేసే విన్యాసాలు బాగా నవ్విస్తాయి. విరామ సన్నివేశాలకు ముందు కథలో మలుపు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో కథ పూర్తిగా ఓ కొత్త మలుపుని తీసుకుంటూ, గ్రామ రాజకీయాల నేపథ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రథమార్ధంలో రాజు డబ్బు కోసం పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినట్టే, ద్వితీయార్ధం కథలోనూ రాజు ఓ ఎత్తుగడ వేస్తాడు. అదే ఈ సినిమాకి కీలకం. ఎన్నికల ప్రచారం, ఊరి జనాన్ని నమ్మించేందుకు కథానాయకుడు పడే అగచాట్ల నేపథ్యం బాగా నవ్విస్తుంది. హీరో స్నేహితులు ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, అది చూసి ఊరి జనాల ప్రతిస్పందన ఇలా సందర్భోచితంగా మంచి హాస్యం వండుతుంది. సోషల్ మీడియా క్యాంపెయిన్, ఎన్నికల హంగామా సాధారణంగానే అనిపించినా, పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. భార్యాభర్తల మధ్య సంభాషణలు ఒకింత సెంటిమెంట్‌ని వండిస్తాయి. కథ, కథనాల విషయంలో అంచనాలేమీ పెట్టుకోకుండా, నరదాగా కాలక్షేపాన్ని ఆశించి వెళ్లిన ప్రేక్షకులకు తప్పకుండా సంతృప్తినిస్తుందీ చిత్రం. నవీన్ పొలిశెట్టి వన్ మేన్ షోలా ఉ ంటుంది ఈ సినిమా, ప్రతీ సన్నివేశంలోనూ తెరపై కనిపిస్తూ, నాన్ స్టాప్ సంభాషణలు చెబుతూ అల్లరి చేస్తుంటాడు. చారులత పాత్రలో మీనాక్షి చౌదరి ఆకట్టుకుంటుంది. ఆమెకి ఇందులో ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. ముఖ్యంగా ద్వితీ-యార్ధంలో ఎక్కువ సన్నివేశాల్లో కనిపించింది. హీరో గ్యాంగ్‌లో కనిపించే చమ్మక్ చంద్ర, మహేశ్, బుల్లిరాజుగా సుపరిచితమైన మాస్టర్ రేవంత్ అక్కడక్కడా నవ్వించారు. రావు రమేశ్ పాత్ర ఆకట్టుకుంటుంది. ప్రథమార్థంలో ఓ కొత్త చిట్టి కనిపించి ప్రేక్షకుల్ని సరైజ్ చేసింది. మిక్కీ జె. మేయర్ పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాపై గట్టి ప్రభావమే చూపించారు. కథ, కథనాల కంటే సంభాషణల రచనే ఈ సినిమాకి ప్రధానబలం. బలమైన కథ లేదనే విషయం బయట వడకుండా, హాస్యం వండించేందుకు రచయితలు ప్రయత్నించారు.