ఓ కుటుంబ కథని ఎంచుకుని రవితేజ చేసిన సినిమానే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సున్నితమైన కథలకు పెట్టింది పేరైన కిశోర్ తిరుమల దర్శకుడు కావడంతో రవితేజని కొత్తగా చూసే అవకాశం ఉంటుందనే ఆశ ప్రేక్షకుల్లో కలిగింది. రామ్ సత్యనారాయణ (రవితేజ), బాలామణి (డింపుల్ హయాతి) భార్యాభర్తలు. తన భర్త రామ్‌పై బాలామణికి ఎంతో నమ్మకం. తను తప్ప వేరే ప్రపంచం తెలియని మనిషి అనుకుంటుంది. తన కుటుంబానికి చెందిన వ్యాపార వ్యవహారాల్లో భాగంగా రామ్ స్పెయిన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అనుకోకుండా మానస శెట్టి (ఆషికా రంగనాథ్)తో బంధం ఏర్పడుతుంది. తనకి పెళ్లయ్యిందనే విషయాన్ని దాచి మరీ, తనని తాను సత్య అని పరిచయం చేసుకుని మాననకు దగ్గరవుతాడు. ఏమీ జరగనట్టే ఇంటికి తిరిగొచ్చిన రామ్ సత్యనారాయణ తనపై తన భార్య చూపిస్తున్న ప్రేమతో అప్పుడప్పుడూ అపరాధ భావానికి గురవుతుంటాడు. ఇంతలోనే స్పెయిన్ నుంచి మానస ఇండియాకి వస్తుంది.
ఆమె వచ్చాక ఏం జరిగింది? ఇద్దరి మధ్య బంధం కొనసాగిందా? భార్య బాలామణికి ఈ విషయం తెలిసిందా? రామ్ అలియాస్ సత్యకు పెళ్లయ్యిందనే విషయం తెలిశాక మానస ఏం చేసింది? తదితర విషయాల్ని తెరపై హృద్యంగా చిత్రీకరించారు. ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయిన చాలా మంది కథానాయకుల్ని, కథల్ని గుర్తు చేస్తుంది ఈ చిత్రం. కానీ, హాస్యంపై మాత్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. సందర్భోచితమైన హాన్యంతో సినిమా నరదా నరదాగా సాగుతూ, మంచి కాలక్షేపాన్నిస్తుంది. కిశోర్ తిరుమల సినిమాల్లో కథానాయకులు సరికొత్తగా కనిపిస్తుంటారు. ఈ సినిమా లోనూ అదే పునరావృతమైంది. రవితేజ కొత్తగానే కనిపించారు. ఆయన లుక్, పాత్రలో ఒదిగిపోయిన తీరు, అలవోకగా ఆయన వినోదం పంచిన తీరు బాగుంది. ఆయన గత సినిమాలతో పోలిస్తే ఇది ఎంతో ఉపశమనం. స్పెయిన్ నేపథ్యంలో కథ మొదలవుతుంది. సత్య, వెన్నెల కిశోర్, సునీల్ తదితరులతో రవితేజ చేసే హంగామా బాగా నవ్విస్తుంది. మానస శెట్టి ఇండి యాకి వచ్చినప్పటి నుంచి సినిమా మరింత సందడిగా మారి పోతుంది. విరామ సన్నివేశాల వరకూ సినిమా ఆసక్తికరంగా అనిపి స్తుంది. ఆ తర్వాతే కథలో సంఘర్షణ తగ్గింది.
మానస శెట్టికి తోడుగా మరో శెట్టి పాత్ర తోడై సన్నివేశాలు సాగిపోతాయే తప్ప కథలో మాత్రం కొత్తగా మారేదేమీ ఉండదు. తొలి సగభాగం తరహాలోనే కథానాయకుడు ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోవడం కనిపిస్తుంటుంది. కాకపోతే బాబాయ్ అంటూ త్రినేత్ర పాత్ర చేసే హంగామా కాస్త నవ్వుల డోసుని పెంచుతుంది. స్పెయినా.. పెయినా.. అంటూ కథలో కొత్త టెన్షన్ మొదలవుతుంది. దాంతో పతాక సన్నివేశాల్లో సంఘర్షణ మోతాదు పెరుగుతుందేమో అనుకుంటాం. కానీ, అందుకు భిన్నంగా ఇలాంటి సమస్యలకు ఓ కొత్త పరిష్కారాన్ని చూపించి.. కథానాయకుడితో ఓ కొత్త విషయా న్ని చెప్పించి కథని ముగించారు. చాలా సార్లు చూసినట్టుగా, అసలు ఉందా లేదా అనిపించే కథతోనే దర్శకుడు నవ్వులు పండించాడు. సోషల్ మీడియాను అనుసరించే వాళ్లను ఇందు లోని సంభాషణలు మరింత అలరిస్తాయి. పాటలకు తగ్గట్టుగా సన్నివేశాల రచన సాగలేదనిపిస్తుంది. మొత్తంగా కాలక్షేపానికి ఏమాత్రం ఢాకా లేదు. రవితేజ హుషారైన నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. పాత్రలో ఒదిగిపోయి, స్వేచ్చగా నవ్వులు పండిం చారు. ఆయన డ్యాన్సులు ఆకట్టుకుంటాయి. కథానాయికలు డింపు ల్ హయాతి, ఆషికా రంగనాథ్ పర్వాలేదనిపిస్తారు. ఆషికా ట్రెండీ గా కనిపించింది. 'వామ్మో వాయ్యో' పాటలో ఇద్దరి డ్యాన్స్ ఆకట్టు కుంటుంది. సునీల్, వెన్నెల కిశోర్, సత్య, మురళీధర్ గౌడ్, రోహ న్.. పాత్రల నేపథ్యంలో పండిన కామెడీ ఈ సినిమాకి హైలైట్. సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫీ, సంగీతం బాగా కుదిరాయి. స్పెయిన్ నేపథ్యంలో సాగే ప్రసాద్ మూరెళ్ల విజువల్స్ ఆకట్టు కుంటాయి. భీమ్స్ పాటలు, చిత్రీకరణ సినిమాకి ప్రధానబలం. కథ కన్నా కూడా వినోదానికే కిశోర్ తిరుమల పెద్ద పీట వేశారు.