తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు చేశాం
ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశాం
తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు
జ్యూరిచ్ లో ఎన్ ఆర్ ఐ టీడీపీ నేతల ఘన స్వాగతం
అమరావతి: ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్ కల్పించే బాధ్యత తనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజను ఏపీ చిరునామాగా మారిందని పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు. చేశామని చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. 2026లో డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్స్‌లు వస్తాయని వివరించారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులు తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. స్విట్జర్లాండ్ జ్యూరిక్ లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు. జ్యూరిక్‌లో రెండోసారి తెలుగు డయాస్పోరాతో సీఎం, మంత్రులు సమావేశమైయ్యారు. డయాస్పోరా భేటీ కోసం జ్యూరిక్ వచ్చిన ఐరోపాలోని 20 దేశాల ఎన్ఆరలు పాల్గొన్నారు. సంక్రాంతి పోటీలు నిర్వహించిన స్విట్జర్లాండ్ తెలుగు సంఘం విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచానికే సేవలు అందించే నాయకత్వం భారత్ సొంతమని వ్యాఖ్యానించారు. ఇతర దేశస్థులతో భారతీయులు పాలునీళ్లలా కలిసిపోతారని అన్నారు. తన ఆలోచలను అన్నీ ఎప్పుడూ నూతనంగా ఉంటాయని తెలిపారు. ఉద్యోగాలు చేయడం కాదని.. ఉ పాధి కల్పించేలా తయారుకావాలని సీఎం చంద్రబాబు సూచించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటప్రెన్యూర్ నినాదంతో తాము ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఎన్ఐర్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రూ.50 కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తామని తెలిపారు. రతన్లాటా ఇన్నోవేషన్ హబ్‌తో సన్‌రైజ్ కనెక్ట్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భారత్ కు వచ్చే పెట్టుబడుల్లో ఒక్క ఏపీకే 25 శాతం వస్తున్నాయని తెలిపారు. భారత్‌కు అతిపెద్ద ఆస్తి... యువ జనాభా అని వ్యాఖ్యానించారు. 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని వివరించారు. 2047 నాటికి నెంబర్ వన్ కమ్యూనిటీగా భారత్ ఉండాలని ఆకాంక్షించారు. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగువాళ్లు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.