ఇరుముడికి చిరంజీవి ప్రత్యేక అభినందనలు
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది 'ఇరుముడి '. రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించగా.. తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ హిట్ సినిమాపై రివ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక సినిమా విజయం సాధిస్తే పరిశ్రమలో అందరికీ పండగే అని చెప్పిన చిరు.. ఈ పరిశ్రమ అందరిది.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి' అని పేర్కొన్నారు. ఇక 'ఇరుముడి చిత్రబృందానికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. నాకెంతో ఇష్టమైన సోదరుడు రవితేజకు అభినందనలు. సినిమాను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా ఆస్వాదించా. రవితేజ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా వాధ్యతను దర్శకుడు శివ నిర్వాణ తన భుజాల పై వేసుకుని గొప్పగా తీర్చిదిద్దారు. సున్నితమైన భావోద్వేగాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. బాలనటి నక్షత్రకు గొప్ప భవిష్యత్ ఉ ండాలని కోరుకుంటున్నా, 'ఇరుముడి'లో భాగమైన నటీనటులకు, టెక్నీషియను, నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు' అని చిరు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ చిత్ర విజయం అర్హమైనదని పేర్కొన్నారు. చిరు పోస్ట్ప రవితేజ స్పందించారు. 'అన్నయ్యా థాంక్కూ.' అంటూ హార్ట్ ఎమోజీలను జోడించి కృతజ్ఞతలు చెప్పారు. విడుదలైన నాటి నుంచి థియేటర్స్ హౌస్ ఫుల్ కళకళలాడుతుండగా, ఆరో రోజు కూడా అదే జోరు కొనసాగింది. కొన్ని థియేటర్లలో ప్రస్తుతం ఉన్న సినిమాను తీసేసి 'ఇరుముడి' వేయాలంటూ పలువురు ప్రేక్షకులు ఆందోళన చేస్తున్నారు. మరికొన్ని చోట్ల సీట్లు సరిపోక కుర్చీలు తెచ్చుకుంటున్నారు. కొన్ని హాళ్లలో ఏకంగా భజనలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.